జియోఫోన్ 2 మేకిన్ ఇండియా కాదట!

ఇండియన్ బిలియనీర్ ముకేశ్ అంబానీ జియోఫోన్ 2ను తీసుకొస్తున్నట్టు ప్రకటించారు. ఆయన ఆ ప్రకటన చేయగా స్థానిక మొబైల్ మేకర్స్ గుండెల్లో రైళ్లు పరిగెట్టాయి. ఇవి కనుక మార్కెట్లోకి వస్తే తమకు చావుదెబ్బేనని భావిస్తున్నాయి. తాజాగా జియో ఫోన్లకు సంబంధించి మరో కొత్త విషయం బయటకొచ్చింది. ఈ ఫోన్లు మేకిన్ ఇండియా కాదన్నదే ఆ విషయం. వీటిని పూర్తిగా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నట్టు ‘ది మొబైల్ అసోసియేషన్ (టీఎంఏ) మొబైల్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ భూపేష్ రాసీన్ తెలిపారు. జియో ఫోన్2 హ్యాండ్‌సెట్లను పూర్తిగా చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నట్టు తెలిపారు. అది సున్నశాతం దిగుమతి సుంకంతో ఇండినేషియా మీదుగా పెద్ద సంఖ్యలో దిగుమతి చేసుకునేందుకు జియో ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు.

జియో ఫోన్ 2 ప్రభావం దాదాపు వంద కంపెనీలపై పడుతుందని వివరించారు. ఇంటెక్స్, ఐటెల్, జివి మొబైల్స్, కార్బన్, లావా, మైక్రోమ్యాక్స్ వంటి కంపెనీలపై జియోఫోన్ 2 ప్రభావం పెద్ద ఎత్తున పడే అవకాశం ఉందని తెలిపారు. మల్టీ నేషనల్ కంపెనీలైన యాపిల్, శాంసంగ్, చైనా మొబైల్ మేకర్స్ అయిన ఒప్పో, షియోమీ తదితర వాటి జియోఫోన్ 2 ప్రభావం అంతగా ఉండబోదని భూపేష్ వివరించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*