నోకియా ఎక్స్ 5 వచ్చేసింది.. లాంచ్ చేసిన హెచ్ఎండీ గ్లోబల్‌

నోకియా నుంచి మరో స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. నోకియా ఎక్స్ సిరీస్‌లో తాజా ఫోన్ నోకియా ఎక్స్5ను హెచ్ఎండీ గ్లోబల్ చైనాలో విడుదల చేసింది. ఇటీవల నోకియ్ ఎక్స్ 6ను విడుదల చేయగా, దానికి సక్సెసర్‌గా దీనిని తీసుకొచ్చింది. హీలియో పీ60 ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌ ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్‌ 3జీబీ వేరయంట్ ధర రూ.10,200 కాగా, 4జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ.14,300గా నిర్ణయించారు. బ్లాక్, వైట్, బ్లూ వేరియంట్లలో అందుబాటులోకి రానుంది.

నోకియా ఎక్స్ 5 స్పెసిఫికేషన్లు: 5.86 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే, హీలియో పీ60 ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌, 3జీబీ/32 జీబీ, 4జీబీ/64 జీబీ ర్యామ్ వేరియంట్లు ఉన్నాయి. 256 జీబీ వరకు పెంచుకోవచ్చు. 13 ప్లస్ 5 మెగాపిక్సల రియర్ డ్యూయల్ కెమెరా, 8 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉన్నాయి. 3060 ఎంఏహెచ్‌ సామర్థ్యం కలిగిన బ్యాటరీని ఉపయోగించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*