లక్ష కోట్ల ఆరోపణలపై జగన్ పూర్తి వివరణ

వైసీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు జగన్ మోహన్ రెడ్డి ఒక మీడియా సంస్థకు తాజాగా ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఆయన పలు అంశాలపై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన తనపై ఉన్న లక్ష కోట్ల ఆరోపణలపై స్పందించారు. జగన్ ఆల్రెడీ లక్ష కోట్లు తిన్నాడని మళ్లీ అధికారంలోకి వస్తే మరో లక్ష కోట్లు దోచుకుంటాడనే కొత్త ఆరోపణ మీ మీద ఉందని ప్రశ్నించగా జగన్ స్పందించారు. అలాంటి ఆరోపణలు చేసేవారు పది పైసలు భాగాన్ని రాసిస్తే ఎక్కడ కావాలంటే అక్కడ సంతకం చేస్తానని అన్నారు.

తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో అవినీతి అనేది లేకుండా చేసేందుకు పూర్తి పారదర్శక విధానాన్ని తీసుకొస్తామని చెప్పారు. దీంతో దేశం మొత్తం ఆంధ్ర రాష్ట్రం వైపు చూసేలా చేస్తామని హామీ ఇచ్చారు. తన తండ్రి వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు జగన్ అనే వ్యక్తి ఒక రాజకీయ నాయకుడు కాదని, ఏ ఐఏఎస్ అధికారితోనూ మాట్లాడింది లేదని, సచివాలయంలో అడుగు పెట్టలేదని, అసలు హైదరాబాద్‌లోనే లేనని చెప్పారు. తాను ఇంత క్లియర్‌గా చెప్పినప్పటికీ తన మీద నిందలు వేస్తున్నారని జగన్ అన్నారు.

This post is also available in : English

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*