ఢిల్లీ పరిణామాలను నిశితంగా గమనిస్తున్న చంద్రబాబు

ఎన్డీఏ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి లోక్‌సభ స్పీకర్ సుమిత్ర మహాజన్ అంగీకరించారు. శుక్రవారం చర్చకు ఆమె ఓకె చెప్పారు. ప్రశ్నోత్తరాలను రద్దు చేసి ఈ చర్చను చేపట్టనున్నారు. ఈ మేరకు బీఏసీలో స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. పూర్తి వివరాలను స్పీకర్ వెల్లడించనున్నారు. బుధవారం మొదలైన పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు అవిశ్వాస తీర్మానానికి ప్రతిపాదించాయి. టీడీపీ తరపున ఎంపీ కేశినేని నాని తీర్మానాన్ని నేడు మూవ్ చేశారు. ఇంకా తీర్మానాలు ఇచ్చిన అందరి పేర్లను స్పీకర్ చదివారు కానీ లాటరీలో కేశినేని నాని పేరు వచ్చిందని, కాబట్టి ఆయనే తన తీర్మానాన్ని మూవ్ చేస్తారని చెప్పారు. ఎన్డీఏకు 2/3 వంతు మెజార్టీ ఉందని, అవిశ్వాసాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధమని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్ కుమార్ చెప్పారు.

మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్డేయేతర పార్టీల అధినేతలతో మంతనాలు జరుపుతున్నారు. ఇప్పటికే ఎన్డీయేతర పార్టీల నేతలను టీడీపీ ఎంపీలు కలుసున్నారు. మరికొందరు నేతలతో చంద్రబాబు ఫోన్ ద్వారా మద్దతు కూడగడుతున్నారు. తృణమూల్, డీఎంకే, జేడీఎస్ తదితర పార్టీల మద్దతును సంపాదించారు. బీజేపీలో ఉన్న అసంతృప్తులతో కూడా చంద్రబాబు మంతనాలు జరుపుతున్నట్లు తెలిసింది. మోదీ సర్కారుపై అవిశ్వాస తీర్మానానికి లోక్‌సభ స్పీకర్ సుమిత్ర మహాజన్ అంగీకరించారంటూ టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ట్వీట్ చేశారు. ఏపీకి న్యాయం చేయాలంటూ పార్లమెంట్‌లోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టామని తెలిపారు. దీనికి సంబంధించి ఫొటోలను కూడా ఆయన జత చేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*