ప్రయాణికుల వాహనాల ధరలు పెంచనున్న టాటా మోటార్స్

ప్రయాణికుల వాహనాల ధరల పెంచేందుకు టాటా మోటార్స్ సిద్ధమైంది. అన్ని మోడళ్లపైనా 2.2 శాతం పెంచాలని నిర్ణయించినట్టు సంస్థ తెలిపింది. ఆగస్టు నుంచి పెరిగిన ధరలు అమలు చేయాలని నిర్ణయించింది. పెట్టుబడి ధరలు విపరీతంగా పెరుగుతున్న కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్ 3 శాతం ధరలు పెంచినప్పటికీ అమ్మకాల విషయంలో ఎటువంటి తేడా లేదని పేర్కొంది. ధరలు తగ్గించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నప్పటికీ ఇన్‌పుట్ కాస్ట్ పెరుగుతుండడంతో ప్యాసింజర్ వాహనాల ధరలు పెంచక తప్పడం లేదని టాటా మోటార్స్ పేర్కొంది.

ఆగస్టు నుంచి పెరిగిన ధరలు అందుబాటులోకి రానున్నట్టు టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ బిజినెస్ యూనిట్ ప్రెసిడెంట్ మయాంక్ పరీక్ తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్‌లోనే ధరలు పెంచినప్పటికీ పెట్టుబడి ధరలు కూడా విపరీతంగా పెరుగుతూ పోతున్నాయని తెలిపారు. ప్రస్తుత టాటా మోటార్స్ ఎంట్రీ లెవల్ స్మాల్ కారు నానో నుంచి ప్రీమియం ఎస్‌యూవీ హెక్సా వరకు విక్రయిస్తోంది. వీటి ధరలు రూ.2.36 లక్షల నుంచి రూ.17.89 లక్షల మధ్య ఉన్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*