రూ.199 ఆఫర్‌ను సవరించిన వొడాఫోన్.. ఇక రోజుకు 2.8జీబీ డేటా

రిలయన్స్ జియో నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకునేందుకు వొడాఫోన్ మరో సరికొత్త వ్యూహంతో ముందుకొచ్చింది. రూ.199 ప్లాన్‌ను అప్‌గ్రేడ్ చేసింది. ఇకపై ఈ ప్లాన్‌లో 28 రోజుల కాలపరిమితో రోజుకు 2.8 జీబీ డేటా చొప్పున అందించనున్నట్టు ప్రకటించింది. అంటే మొత్తం 78.4 జీబీ డేటా లభిస్తుందన్నమాట. దీంతోపాటు అపరిమిత వాయిస్ కాల్స్, ఎస్సెమ్మెస్ వంటి ప్రయోజనాలు లభిస్తాయి. అయితే, వాయిస్ కాల్స్‌పై ఎఫ్‌యూపీ లిమిట్ ఉంటుంది.

రూ.199 ప్యాక్‌లో గతంలో రోజుకు 1.4జీబీ డేటా మాత్రమే ఇవ్వగా ఇప్పుడు దానిని రెండింతలు చేయడం విశేషం. ప్రస్తుతం ఈ ప్యాక్ ఎంపిక చేసిన వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. 4జీ నెట్‌వర్క్ అందుబాటులో ఉన్న సర్కిళ్లలో మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉన్నట్టు వొడాఫోన్ పేర్కొంది. ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ సర్కిళ్లలోని వినియోగదారులకు ఈ ఆఫర్ వర్తించదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*