వాట్సాప్ నుంచి మరో కొత్త ఫీచర్

వినియోగదారుల సౌకర్యార్థం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చే వాట్సాప్ నుంచి త్వరలోనే మరో సరికొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఏ‌దైనా నంబరు నుంచి వరుసగా మెసేజ్‌లు వస్తున్నప్పుడు చిరాకు అనిపిస్తుంది. అయితే, ఇకపై ఆ బాధతప్పినట్టే. ఎందుకంటే త్వరలోనే నేరుగా యాప్‌లోకి వెళ్లకుండానే ‘మ్యూట్’ చేసుకునే వెసులుబాటు రాబోతోంది. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ సౌకర్యం త్వరలోనే వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.

మన కాంటాక్ట్ నంబర్లలోని ఏదైనా నంబరు నుంచి వరుసగా 51 కంటే ఎక్కువ సందేశాలు వచ్చినప్పుడు ఈ ‘మ్యూట్’ బటన్ ప్రత్యక్షమవుతుంది‌. ఫలితంగా యాప్‌లోకి వెళ్లకుండానే ఆ కాంటాక్ట్ నుంచి వచ్చే సందేశాలను మ్యూట్ చేసుకోవచ్చు.
ఈ ఆప్షన్‌తోపాటు ‘మార్క్ యాజ్ రీడ్’ అనే ఆప్షన్‌ను కూడా తీసుకురానున్నట్టు వాట్సాప్ ఇది వరకే ప్రకటించింది. అయితే, ప్రస్తుతానికి మాత్రం మ్యూట్ ఆప్షన్‌ను మాత్రమే తీసుకొస్తున్నారు. బీటా వెర్షన్‌లో ప్రస్తుతం ఇది అందుబాటులో ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*