జేసీని ఒప్పించిన చంద్రబాబు

అనంతపురం పార్లమెంట్ సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డిని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కూల్ చేశారు. అవిశ్వాస తీర్మానం పెట్టిన కీలక సమయంలో అలకబూనిన జేసీని సముదాయించారు. వర్షాకాల పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యేలా ఒప్పించారు.

బీజేపీకి వ్యతిరేకంగా అవిశ్వాసానికి టీడీపీ అంతా సిద్ధం చేసుకుంటుంది, శుక్రవారమే చర్చ జరగనుంది. దీంతో దేశ వ్యాప్తంగా పలు బీజేపీ వ్యతిరేక పార్టీల మద్దతు కూడగట్టేందుకు టీడీపీ ఎంపీల అన్ని చోట్లకూ తిరిగారు. పలువురుని కలిసి మద్దతివ్వాల్సిందిగా కోరారు. అయితే ఈ క్రమంలో సడెన్‌గా సొంత పార్టీ ఎంపీ అయిన జేసీ టీడీపీ విప్‌ను దిక్కరిస్తూ తాను పార్లమెంటుకు హాజరుకానని చెప్పడంతో అంతా షాకయ్యారు. ఏం చెయ్యాలని తలలు పట్టుకున్నారు.

ఎందుకంటే దేశ వ్యాప్తంగా మద్దతు కూడగడుతున్న వేళ సొంత పార్టీ ఎంపీనే గైర్హాజరైతే పరువు పోతుంది. మద్దతిచ్చేవాళ్లు కూడా నమ్మని పరిస్థితి ఉంటుందని టీడీపీ కంగారుపడింది. అయితే పరిస్థితి తీవ్రతను అంచనా వేసిన చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగి జేసీని ఒప్పించారు.

జేసీ తన నివాసంలో తాజాగా మీడియాతో మాట్లాడారు. తనతో చంద్రబాబు స్వయంగా మాట్లాడారని, ఇన్నేళ్లకు పార్లమెంటులో అవిశ్వాసం పెట్టామని, అలాంటిది మనమే హాజరుకాకపోతే పార్టీకి చెడ్డపేరు వస్తుందని సీఎం తనకు సూచించినట్టు జేసీ తెలిపారు. కాబట్టి పార్టీకి చెడ్బపేరు కాకూడదనే తాను పార్లమెంటు సమావేశాలకు హాజరవ్వాలని నిర్ణయించుకున్నట్టు జీసీ తెలిపారు.

This post is also available in : English

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*