అవిశ్వాస వేళ పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు

లోక్‌సభలో టీడీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగనున్న నేపథ్యంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందించారు. సోషల్ మీడియా ట్విట్టర్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల్లో ఆయన ప్రత్యేక హోదా అంశాన్ని హైలెట్ చేశారు.

బీజేపీ నడుపుతున్న కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ తాను ప్రజలతో పాటు పోరాటం చేశానని అన్నారు. అయితే మన హక్కును అర్ధం చేసుకుని తగిన ప్రాముఖ్యత కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలంటే అందుకు పార్లమెంటుకు మించిన వేదిక మరొకటి ఉండదని, ఏపీకి న్యాయం చేయాలని పవన్ కళ్యాణ్ ట్విట్టర్‌లో అన్నారు. నేడు లోక్‌సభలో ప్రత్యేక హోదా అంశంతో పాటు పలు విభజన చట్టం హామీలన్నింటిపై చర్చ జరగనుంది.

బీజేపీకి టీడీపీపై ఉన్న కోపంతో ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వకపోవడం సరికాదని కూడా జనసేనాని ట్వీట్‌లో పేర్కొన్నారు.

 

 

This post is also available in : English

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*