తన రెండో పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన సింగర్ సునీత

ప్రముఖ తెలుగు సింగర్ సునీత తన రెండో పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చారు. ఫేస్‌బుక్‌లో ఆమె లైవ్‌లోకి వచ్చి అందులో పూర్తి వివరాలు వెల్లడించారు. తనకు సడెన్‌గా తెలిసిన వాళ్లందరి నుంచి చాలా కాల్స్ వస్తున్నాయని, సెకండ్ మ్యారేజ్ చేసుకుంటున్నావని వార్తలొస్తున్నాయని అడుగుతున్నారని కొంత అసహనం వ్యక్తం చేశారు. అందుకే తాను ఈ వీడియో చేయాల్సి వచ్చిందని వివరించారు. తన రెండో పెళ్లి వార్తలను ఆమె పూర్తిగా ఖండించారు.

తనకు ప్రస్తుతం అలాంటి ఆలోచనలేమీ లేవని ఆమె స్పష్టం చేశారు. ఒకవేళ అలాంటిదేమైనా ఉంటే తానే స్వయంగా వెల్లడిస్తానని చెప్పారు. అయితే తన సెకండ్ మ్యారేజ్ గురించి చాలా మంది ఇంతలా ఆలోచిస్తున్నారా? అనే ఆశ్చర్యం తనకు కలిగిందని, తాను సుఖంగా ఉండాలని ఆలోచించిన వారందరికీ థాంక్స్ అని ఆమె చెప్పారు. ఒకవేళ తనకు రెండో పెళ్లి చేసుకోవాలని అనిపిస్తే తనకు ఆ హక్కు పూర్తిగా ఉందని, అది తన వ్యక్తిగత విషయమని అన్నారు.

Posted by Sunitha on Thursday, July 19, 2018

This post is also available in : English

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*