నిండు సభలో మర్యాద లేకుండా కౌగిలించుకుంటావా?

సభలో రాహుల్ గాంధీ ప్రవర్తించిన తీరుపై బీజేపీ భగ్గున మండుతోంది. ఆయన ప్రవర్తనపై సభాహక్కుల ఉల్లంఘన నోటీస్ ఇవ్వాలని అధికారపార్టీ భావిస్తోంది. నిండు సభలో రాహుల్ గాంధీ సభా మర్యాదలను పక్కన పెట్టి ప్రధాని సీటు దగ్గరికి వచ్చి కౌగిలించుకోవడం ఏంటని బీజేపీ సభ్యులు విమర్శిస్తున్నారు. సభా మర్యాదలకు భంగం వాటిల్లిందని వారు మండిపడుతున్నారు. అందుకే సభాహక్కుల నోటీస్ ఇవ్వాలని బీజేపీ పార్లమెంటరీ నేతలు చర్చిస్తున్నారు. ఈ విషయంపై సమాలోచనలు జరుపుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*