ప్రధాని ఆరోపణలు బాధ కలిగించాయి: చంద్రబాబు

అమరావతి: తనపై ప్రధాని మోదీ రాజకీయ ఎదురుదాడి చేశారని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. లోక్‌సభలో తమ పార్టీ పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. మోదీ అహంకారంతో మాట్లాడుతున్నారని ఆరోపించారు. ప్రధాని ఇంత చులకనగా మాట్లాడటం బాధాకరమని చంద్రబాబు చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని, అవి నెరవేరకపోవడంతో బయటకు వచ్చామని చంద్రబాబు చెప్పారు. అవిశ్వాస తీర్మానం విషయంలో తమకు మద్దతిచ్చిన పార్టీలకు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.

మరోవైపు చంద్రబాబు..  పవన్, జగన్‌లపై కూడా విమర్శలు గుప్పించారు. తాము కేంద్రంపై పోరాడుతుంటే ఒకరు కోర్టులో ఉంటే మరొకరు ట్వీట్లపైన ట్వీట్లు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

 

This post is also available in : English

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*