లోక్‌సభలో భరత్ అనే నేను సినిమా కథ చెప్పిన గల్లా జయదేవ్

న్యూఢిల్లీ: కేంద్రంపై లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భరత్ అనే నేను సినిమా కథ చెప్పారు. ఇచ్చిన మాట తప్పరాదనేది సినిమా నేపథ్యమని, అదే తరహాలో మోదీ సర్కారు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని సూచించారు. మెజార్టీ, మోరాలిటీ మధ్య జరుగుతున్న ధర్మ యుద్ధమని గల్లా జయదేవ్ అభివర్ణించారు. ఇది టీడీపీ-బీజేపీ మధ్య పోరాటం కాదని చెప్పారు. ఎన్డీయే నుంచి రాగానే తమపై కక్ష కట్టారని ఆరోపించారు. ప్రత్యేక హోదా సహా అన్ని హామీలను నెరవేర్చాలని కోరారు.

 

కేంద్రం అనాలోచిత నిర్ణయం కారణంగా ఏపీ నష్టపోయిందని  గల్లా జయదేవ్ చెప్పారు. పార్లమెంట్‌ చరిత్రలోనే అతి ముఖ్యమైన రోజంటూ తమకు మద్దతిచ్చిన పార్టీల నేతలకు ధన్యవాదాలు తెలిపారు. గల్లా జయదేవ్ ఇంగ్లీష్ భాషలో తన ప్రసంగాన్ని కొనసాగించారు. ప్రధాని మోదీ సహా బీజేపీ అగ్రనేతలంతా ఆసక్తిగా విన్నారు.

 

This post is also available in : English

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*