అవిశ్వాస తీర్మానంపై టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ పూర్తి ప్రసంగం

ఢిల్లీ: లోక్ సభలో అవిశ్వాస తీర్మానంపై టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ప్రసంగంలో ఆసక్తికర విషయాలు ప్రస్తావించారు.

అవిశ్వాసంపై చర్చను ప్రారంభించడం సంతోషంగా ఉంది –

మద్దతిచ్చిన పార్టీలన్నింటికీ ధన్యవాదాలు –

భరత్ అనే నేను సినిమాను ప్రస్తావించిన గల్లా జయదేవ్ –

ఒక వ్యక్తి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలన్నదే కథాంశం – కానీ పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలను విస్మరించారు –

ఇది టీడీపీ, బీజేపీ మధ్య యుద్ధం కాదు – ఇది ఏపీ ప్రజల ధర్మపోరాటం –

ఏపీ విషయంలో పూర్తి నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు – ఏపీ ప్రజలను వంచనకు గురిచేస్తున్నారు –

అశాస్త్రీయంగా రాష్ట్రాన్ని విభజించారు – లోక్ సభ తలుపులు మూసి ఏపీని విభజించారు –

ఆస్తులు తెలంగాణకు, అప్పులు ఏపీకి ఇచ్చారు –

ఏపీపై రూ.లక్షా 3వేల కోట్ల రుణభారం మోపారు –

వినియోగాన్ని బట్టి విద్యుత్ పంపకాలు చేశారు –

అప్పులు మాత్రం జనాభా ప్రకారం పంచారు –

సింగరేణి కాలరీస్ లో 51 శాతం వాటాను తెలంగాణకు ఇచ్చారు –

విభజన జరిగిన నాలుగేళ్ల తర్వాత కూడా కనీస సౌకర్యాలు లేకుండా ఉంది –

మోదీ ప్రభుత్వ చర్యలతో ఏపీ మరింత వివక్షకు గురవుతోంది –

ఇవ్వాల్సింది ఇవ్వలేదు.. హామీలు నెరవేర్చలేదు –

ఏపీ పునర్విభజన చట్టాన్ని అప్రజాస్వామికంగా ఆమోదించారు –

ఇదే సభలో విభజన బిల్లు ఎలా ఆమోదించారో ప్రతిఒక్కరికి తెలుసు –

రూ. 16 వేల కోట్ల కనీస రెవెన్యూ లోటును కూడా పూడ్చుకోలేని పరిస్థితి –

రూ.24 వేల కోట్లు లోటును కేంద్రం భర్తీ చేయాల్సి ఉంది –

విభజనతో ఏపీ భారీగా నష్టపోయింది –

విభజనతో ఏపీ ఆదాయ వనరులను కోల్పోయింది –

విభజన పాపంలో బీజేపీది కూడా సగం ఉంది –

ఏపీ పునర్విభజన బిల్లు పాస్ కావడంలో కాంగ్రెస్‌తో సమానమైన బాధ్యత బీజేపీకి ఉంది –

పొరుగువారితో పోల్చుకోవడం సమాజంలో సహజ సూత్రం,అదేవిధంగా మా పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటున్నాం –

అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ దక్షిణాది రాష్ట్రాలతో సమానంగా ఉండేది –

విభజన తర్వాత ఏపీ అట్టడుగు పడిపోయింది –

తక్కువ జనాభా, అధిక వనరులతో తెలంగాణ ముందు, ఏపీ వెనకబడింది –

వ్యవసాయ రంగంలో కాస్త ముందున్నా..

పారిశ్రామికంగా పొరుగురాష్ట్రాలతో వెనకబడి ఉంది –

పారిశ్రామిక, సేవల రంగంలో దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే పూర్తిగా వెనుకబడి ఉంది –

విభజిత ఆంధ్రప్రదేశ్ లో ఒక్కటి కూడా జాతీయ సంస్థ లేదు –

కేంద్రం జాతీయ సంస్థలను ప్రకటించినప్పటికీ అవి ఎదగడానికి సమయం పడుతుంది –

తలసరి ఆదాయంలోనూ ఏపీ వెనుకబడి ఉంది –

దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే తలసరి ఆదాయంలో 20 శాతం వెనకబడి ఉన్నాం –

ప్రత్యేక హోదాను ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నా –

ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్‌కు చాలా ప్రత్యేకమైనది –

వాస్తవాలను వక్రీకరించకుండా సుస్పష్టంగా విన్నవిస్తుననా –

తెలుగుతల్లిని కాంగ్రెస్ రెండుగా విభజించిందని మోదీగారే అన్నారు –

కాంగ్రెస్ తల్లిని చంపి బిడ్డను బతికించిందని మోదీ అన్నారు –

తెలుగుతల్లిని కాంగ్రెస్ రెండుగా విభజించిందని మోదీగారే అన్నారు –

తల్లీబిడ్డ ఇద్దరినీ సంరక్షించే బాధ్యత తమదని మోదీ అన్నారు, మేము విశ్వసించాం –

ప్రధానిమంత్రిగారు..మీకన్నా ముందున్న ప్రధానమంత్రి ఇచ్చిన హామీలపై మీకు గౌరవం ఉందా? –

మీరిచ్చిన హామీలు చేస్తారని మేము విశ్వసించవచ్చా? –

ఆనాడు రాజ్యసభలో ఎంపీగా అన్న నాయకులు ఐదేళ్లు కాదు పదేళ్లు అని చెప్పిన విషయం మీకు గుర్తుందా? –

తిరుపతి, నెల్లూరులో మీరిచ్చిన భరోసా గుర్తుందా? –

నేను తినను.. ఎవర్నీ తిననివ్వనని అన్నారు.. వెతికివెతికి పట్టుకుంటానన్నారు –

ఆంధ్రప్రదేశ్ ప్రజలు మోసానికి, వెన్నుపోటుకు గురయ్యారని భావిస్తున్నారు –

ఈ మాటలన్నీ ఆవేదన, ఆందోళనతో వస్తున్నవే –

మోసానికి, నమ్మకద్రోహానికి గురయ్యామని ఆంధ్రా ప్రజలు ఆవేదన చెందుతున్నారు –

రాష్ట్ర విభజన ప్రత్యేక హోదా ఇస్తామనే హామీతోనే ప్రారంభమైంది –

కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడమే పార్లమెంటు చేసిన అతి పెద్ద తప్పు –

ప్రత్యేక హోదా ఇవ్వొద్దని 14వ ఆర్థిక సంఘం చెప్పిందనడం మిథ్య –

ఆర్థిక సంఘం సభ్యుడు టి.గోవిందరావుగారు అలాంటి సిఫార్సు చేయలేదని చెప్పారు –

ఆర్‌బీఐ మాజీ గవర్నర్ వైవీరెడ్డిగారు ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పారు –

14వ ఆర్థిక సంఘం పేరు చెప్పి కేంద్రం ప్రత్యేక హోదాను తిరస్కరించింది –

ఏ కమిషన్ ఇచ్చిన సిఫార్సులనైనా పాత తేదీతో అమలు చేయడమన్నది పార్లమెంటు చరిత్రలో లేదు –

గతంలో ఇచ్చిన హామీలకు ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలు వర్తించవు –

సమయం విషయంలో ఇక్కడ కూడా మమ్మల్ని వివక్షకు గురిచేయవద్దు –

మా ఆవేదనను అర్థం చేసుకోండి –

ప్రధాన మంత్రిగారు, ఆర్థిక మంత్రిగారు వాస్తవ విషయాలను గమనించండి –

మీకు చేతులు జోడించి నమస్కరిస్తున్నాం.. మాకు ప్రత్యేక హోదా ఇవ్వండి –

ఇంత జరిగినా.. ఆర్థికమంత్రిగారు కరుణించలేదు, చిల్లిగవ్వ విదల్చలేదు –

మార్చి 17న బీజేపీ అధ్యక్షుడు ఇది బీజేపీ, టీడీపీకి మధ్య యుద్ధమని చెప్పారు –

ఇప్పుడు జరుగుతున్నది బీజేపీకి, టీడీపీకి మధ్య జరుగుతున్న యుద్ధం కాదు –

ఆధిపత్యానికి, నైతికతకు మధ్య జరుగుతున్న పోరాటమిది – ఇది ధర్మపోరాటం.. ధర్మయుద్ధం –

ఏపీకి ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడమన్నది మోదీ ప్రభుత్వం వివక్ష –

భారతదేశంలో భాగమైన ఏపీకి కనీస ప్రాధాన్యత ఇవ్వట్లేదు –

ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును రాజకీయ క్రీడలో భాగం చేశారు –

రాష్ట్ర ప్రయోజనాలకన్నా రాజకీయ ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు –

బీజేపీ, వైసీపీ, జనసేన మేము యూటర్న్ తీసుకున్నామని ఆరోపిస్తున్నాయి –

మీరు చెప్పండి.. మేము ఎక్కడ యూటర్న్ తీసుకున్నామో –

జీఎస్టీ అమలు తర్వాత ప్రత్యేక హోదా అనేదే ఉండదని చెప్పారు-

దేశంలో వెనకబడిన జిల్లాలకు ఇచ్చినట్లే మా రాష్ట్రంలో వెనకబడిన జిల్లాలకు ఇచ్చారు –

కేబీకే, బుందేల్ ఖండ్ తరహా ప్యాకేజీ మాకెందుకు ఇవ్వలేదు –

కేబీకేకు రూ.5200 కోట్లు, బుందేల్‌ఖండ్‌కు రూ.7,200 కోట్ల ప్యాకేజీ ఇచ్చారు –

ఆ రెండు ప్యాకేజీల కింద తలసరిగా 4115 ఖర్చు చేస్తే, ఏపీకి 428 ఇచ్చారు ఇదేం న్యాయం –

యూసీలు ఇవ్వలేదని అనేక సందర్భాల్లో ఆరోపించారు –

ప్రతి యూసీని ఇక్కడ చూపించేందుకు సిద్ధంగా ఉన్నా –

వెనకబడిన జిల్లాలకు ఇచ్చిన నిధులను వెనక్కి తీసుకున్నారు, ఇది నిజం కాదా? –

వెనకబడిన జిల్లాలకు ఇచ్చిన నిధుల దస్త్రం ఇంకా పీఎంవోలోనే పడి ఉంది, ఇదా మీరు మాకు చేసే న్యాయం? –

పనుల విభజనలో భాగంగా ఏపీకి రూ.3200 కోట్ల నష్టం జరిగింది, దీన్ని ఎవరు భర్తీ చేస్తారు? –

42 శాతం నిధులు రాష్ట్రాలకు ఇస్తామంటున్నారు – 2.35 లక్షల కోట్ల సెస్సుల్లో రాష్ట్రాలకు ఒక్క రూపాయి కూడా రావట్లేదు –

11 ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాలతో పోలిస్తే రెవెన్యూ లోటు ఎక్కవ ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ –

బీజేపీ మమ్మల్ని ఈశాన్య రాష్ట్రాలతో సమానంగా చూస్తోంది తప్ప..దక్షిణాది రాష్ట్రాలతో కాదు –

ఇదేనా మాకు దక్కుతున్న గౌరవం? –

ఎఫ్ఆర్‌బీఎం నిబంధనలని చెప్పేదంతా కాలయాపన కోసమే –

కేంద్రం ఇచ్చే నిధులను దేశంలో ఏ రాష్ట్రమైనా ఎస్‌పీవీ ఏర్పాటు చేసిందా? –

కేంద్రం ఇచ్చే నిధులకు దేశంలో ఏ రాష్ట్రమైనా ఎస్‌పీవీ ఏర్పాటు చేసిందా? –

పోలవరానికి రూ.58,600 కోట్లయితే.. రూ.6 వేల కోట్లు మాత్రమే ఇచ్చారు –

కొత్త రాజధానికి రూ.43 వేల కోట్లు అవసరమైతే వెయ్యి కోట్లు మాత్రమే ఇచ్చారు –

పోలవరానికి ఇచ్చే నిధులు విభజన చట్టంలోని సెక్షన్ 90 కింద ఇచ్చేవి –

ఏపీకి ఇచ్చిన ప్రతి రూపాయి కూడా విభజన చట్టంలో భాగంగా ఇచ్చినవే –

ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చే నిధులన్నీ పునర్విభజన చట్టం ప్రకారం కచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే –

ఎంతో ఉదారంగా సాయం చేశామని చెప్పడం శుద్ధ అబద్ధం –

ఛత్రపతి శివాజీ విగ్రహానికి రూ.3 వేల కోట్లు, పటేల్ విగ్రహానికి రూ.3,500 కోట్లు ఇచ్చారు –

మా రాజధానికి ఇచ్చింది కేవలం రూ.వెయ్యి కోట్లు – మా రాజధాని విగ్రహాల విలువ చేయదా? –

ఢిల్లీ కన్నా పెద్దది, ఉత్తమమైన రాజధాని నిర్మిస్తామని ప్రధాని స్వయంగా హామీ ఇచ్చారు –

ఇతర రాజధానులు చూసి రావాలని కూడా ప్రధాని చెప్పారు –

కజకిస్థాన్ రాజధాని ఆస్థానాకు వెళ్లి చూసి రావాలని ప్రధానమంత్రిగారు మీరు చెప్పలేదా? –

మీరిచ్చిన హామీతో రైతులంతా ముందుకొచ్చి భూములిచ్చారు – రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను మీరు సందిగ్ధంలో పడేశారు : ఎంపీ గల్లా జయదేవ్

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*