హైకోర్టును ఆశ్రయించిన పరిపూర్ణానంద

ఆరు నెలల నగర బహిష్కరణపై స్వామీ పరిపూర్ణానంద హైకోర్టును ఆశ్రయించారు. తనపై విధించిన ఉత్తర్వులను కొట్టివేసేలా ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించి సోమవారం విచారణ జరగబోతోంది. ఈ కేసులో ప్రతివాదిగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఉంటారు.

పది రోజుల క్రితం రాముడిపై వ్యాఖ్యల వివాదంలో కత్తి మహేశ్ ను, స్వామి పరిపూర్ణానందను ఆరు నెలల పాటు హైదరాబాద్‌ నుంచి బహిష్కరించారు. ఈ మధ్యలో పర్మిషన్ లేకుండా హైదరాబాదులో ఇద్దరూ కనిపిస్తే అరెస్టు చేసి, మూడేళ్లు జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించారు. ద తెలంగాణ ప్రివెన్షన్ ఆఫ్ యాంటీ సోషల్ అండ్ హజార్డస్ యాక్ట్ 1980, సెక్షన్ 3 కింద ఈ నిర్ణయం తీసుకున్నట్టు డీజీపీ తెలిపారు. భావ వ్యక్తీకరణ ప్రాథమిక హక్కు అయినప్పటికీ, సమాజంలో ఇతరుల మనోభావాలు దెబ్బతినకుండా మాట్లాడాల్సిన అవసరం ఉందని మహేందర్ రెడ్డి అన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*