కొద్దిరోజులు ఆగితే అద్దెకు తెలంగాణ జైళ్లు

ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం, ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశం నార్వే అని తేలింది. క్రైమ్ పూర్తిగా తగ్గుముఖం పట్టేసరికి, అక్కడి జైళ్ల శాఖ వినూత్నంగా ఆలోచించింది. కావాలంటే చెప్పండి మా జైళ్లను అద్దెకిస్తాం అని పక్క దేశాలకు బంపర్ ఆఫర్ ఇస్తున్నాయి. శిక్షాకాలాన్ని బట్టి ఖైదీకి ఇంత అద్దె చొప్పున వసూలు చేస్తూ, ప్రభుత్వానికి అదనపు ఆదాయాన్ని సమకూరుస్తున్నాయి.

సరిగ్గా అలాంటి ఆలోచనే చేస్తోంది తెలంగాణ జైళ్ల శాఖ. ఎందుకంటే గత రెండేళ్లుగా చూసుకుంటే నేరాల సంఖ్య చాలా తగ్గింది. రాష్ట్రంలోని అన్ని జైళ్లలో కలిపి ఒకేసారి 6,848 ఖైదీలను పెట్టొచ్చు. అయితే ప్రస్తుతం ప్రిజనర్స్ సంఖ్య ఆరువేల చిల్లర మాత్రమే ఉంది. అంటే ఎంతలేదన్నా ఇంకో 800 ఖైదీలు పట్టే బారెక్స్ ఖాళీగా వున్నాయి. అయితే ఈ సంఖ్య నిలకడగా ఉండటం లేదు. అటుఇటుగా మారుతోంది. ఇంకో ఏడాది తర్వాత శిక్షాకాలం ముగిసి, ఇతరాత్ర కారణాల వల్ల కొంతమంది ఖైదీలు విడుదలవుతారు. అప్పుడు సంఖ్య 5 వేలు అయ్యే అవకాశం ఉంది. ఆ నంబర్ ఒకసారి ఫిక్సయితే, అచ్చం నార్వేలాగే తెలంగాణ జైళ్లను అద్దెకిచ్చే ప్రతిపాదనను గవర్నమెంటు ముందు పెట్టాలని జైళ్లశాఖ భావిస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*