మంత్రి కేటీఆర్‌ ని కలిసిన మలయాళీ సూపర్ స్టార్ మమ్ముట్టి

మలయాళీ సూపర్ స్టార్ మమ్ముట్టి మంత్రి కేటీఆర్‌ ని కలిశారు. ఈనెల 25న రవీంద్రభారతిలో జరగబోయే ఇన్నిటెక్ ఆవార్డ్స్ కార్యక్రమానికి హాజరు కావల్సిందిగా మమ్ముట్టి మంత్రిని ఆహ్వానించారు. తెలంగాణ ప్రభుత్వ భాగస్వామ్యంతో తెలంగాణ ప్రాంత మలయాళీ అసోసియేషన్ కలిసి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో స్టార్టప్స్ ఆంట్రప్రెన్యూర్‌ షిప్ అవార్డులను అందించనున్నట్లు ఈ సందర్భంగా మంత్రికి తెలియజేశారు. ఈ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కొన్ని పథకాలపైన మమ్ముట్టి ఆసక్తి కనబరిచారు. ముఖ్యంగా రైతులకు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ఇన్-పుట్ సబ్సిడీ పథకాన్ని మమ్ముట్టి ప్రశంసించారు. తెలంగాణ ప్రభుత్వం శబరిమల దేవస్థానం దగ్గర కేరళ ప్రభుత్వ సహకారంతో చేపడుతున్న పలు కార్యక్రమాలతోపాటు, తెలంగాణలో ఉన్న మలయాళీలకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాన్ని ఈ సందర్భంగా మంత్రి మమ్ముట్టికి వివరించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*