వైసీపీ ట్రాప్‌లో పడి బాబు యూ టర్న్ తీసుకున్నారు: మోదీ

న్యూఢిల్లీ: తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే చంద్రబాబు యూ టర్న్ తీసుకున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. టీడీపీ అవిశ్వాస తీర్మానంపై చర్చకు సమాధానం చెబుతూ మోదీ చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. చంద్రబాబు వైసీపీ ఉచ్చులో పడి ఎన్డీయేకు దూరమయ్యారని చెప్పారు.

2016 సెప్టంబర్‌లో ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించామని, నాటి ప్యాకేజీని చంద్రబాబు స్వాగతించారని మోదీ గుర్తు చేశారు. ప్యాకేజీకి అంగీకరించి టీడీపీ యూ టర్న్ తీసుకుందని మోదీ చెప్పారు. ఏపీ ప్రజల సంక్షేమం విషయంలో కేంద్రం వెనుకడుగు వేయదని మోదీ చెప్పారు. విభజన తర్వాత ఏపీ-తెలంగాణ మధ్య అనేక వివాదాలు వచ్చాయని, వారి మధ్య సయోధ్యకు గవర్నర్‌తో పాటు తాను కూడా ఎన్నోసార్లు సర్ది చెప్పామన్నారు. టీడీపీ నేతలు ఏదో ఒక పేచీతో ఫిర్యాదు చేసేవారని, అయితే కేసీఆర్ రాజకీయ పరిణితి చూపించేవారని మోదీ చెప్పారు. వాస్తవానికి టీడీపీకి ఎన్డీయేతో ఏ పేచీ లేదని, టీడీపీ వైసీపీ ఉచ్చులో పడి తమను దూరం చేసుకుందని మోదీ చెప్పారు.

This post is also available in : English

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*