వీగిన అవిశ్వాస తీర్మానం.. వ్యతిరేకంగా 325 ఓట్లు

న్యూఢిల్లీ: మోదీ సర్కారుపై టీడీపీ పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. తీర్మానానికి వ్యతిరేకంగా 325 మంది ఓటేశారు. తీర్మానానికి అనుకూలంగా 126 మంది ఓటేశారు. ఓటింగ్ సమయంలో సభలో 451 మంది ఎంపీలున్నారు. తొలుత మూజువాణి ఓటుతోనే తీర్మానం వీగిపోయిందని స్పీకర్ ప్రకటించారు. అయితే ప్రతిపక్షాలు పట్టుబట్టడంతో ఓటింగ్ చేపట్టారు.

 

తీర్మానం వీగిపోయాక సభను సోమవారానికి వాయిదా వేశారు. అంతకుముందు మాట్లాడిన ప్రధాని మోదీ ప్రతిపక్షాలు 2014లో మరో అవిశ్వాస తీర్మానం పెట్టి గెలవాలంటూ ఎద్దేవా చేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*