లోక్‌సభలో అదిరిపోయే సీన్.. ప్రధాని సహా అందరికీ షాకిచ్చిన రాహుల్

న్యూఢిల్లీ: అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో చర్చ సందర్భంగా కేంద్రాన్ని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తీవ్రంగా విమర్శించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన ప్రసంగాన్ని ముగించి అకస్మాత్తుగా ప్రధాని వద్దకు వెళ్లారు. కౌగిలించుకుంటాను లేచి నిల్చోవాలని కోరారు. ఊహించని రీతిలో రాహుల్ ప్రవర్తించడంతో మోదీ షాకయ్యారు. ప్రధాని కూర్చుని ఉండగానే బలవంతంగా ఆయన్ను కౌగిలించుకున్నారు. వెంటనే మళ్లీ తిరుగుపయనమయ్యారు.

రాహుల్ తీరుతో కొన్ని క్షణాలు ఇబ్బంది పడిన మోదీ అంతలోనే తేరుకున్నారు. రాహుల్‌ను వెనక్కు పిలిచారు. రాహుల్ భుజం తట్టి అభినందించారు. రాహుల్ తీరును చూసి సభలో స్పీకర్ సహా అంతా ఆశ్చర్యపోయారు. రాహుల్ తిరిగి తన సీట్ వద్దకు రాగానే కాంగ్రెస్ ఎంపీలు చప్పట్లు చరిచారు.

 

 

రాహుల్  ప్రసంగంలో తనపై చేసిన ఆరోపణలపై రక్షణమంత్రి నిర్మలా సీతారామన్‌ స్పందిస్తూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాహుల్ చేసిన ఆరోపణలను కొట్టిపారేశారు.

This post is also available in : English

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*