మంగళవారం ఏపీ బంద్: వైఎస్ జగన్

విజయవాడ: కేంద్ర వైఖరికి నిరసనగా ఈ నెల 24న ఏపీ బంద్ నిర్వహిస్తామని వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం బంద్‌కు అన్ని వర్గాల వారూ సహకరించాలని జగన్ కోరారు. టీడీపీ ఎంపీలందరూ రాజీనామా చేసి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. టీడీపీ-బీజేపీ కలిసి ఆడుతున్న నాటకమంటూ ఆయన పరకాల ప్రభాకర్, వెంకయ్యనాయుడు ఉదాహరణలిచ్చారు. జాతీయ మీడియాతో మాట్లాడటం కోసం ప్రత్యేకంగా ఢిల్లీ వెళ్లక్కర్లేదని, ఎంపీలందరూ రాజీనామా చేస్తే జాతీయ మీడియానే విజయవాడకు వస్తుందని జగన్‌ చంద్రబాబుకు సూచించారు. అవిశ్వాసం వీగిపోయాక ఢిల్లీ వెళ్లి చంద్రబాబు ఏం చేస్తారని జగన్ ప్రశ్నించారు.

కాంగ్రెస్, బీజేపీ రెండూ ఏపీ ప్రజలకు అన్యాయం చేశాయని జగన్ ఆరోపించారు. ఎవర్నీ నమ్మవద్దని సూచించారు. ఏపీలో ఉన్న మొత్తం 25 మంది ఎంపీలు ఒక్కతాటిపైకి వచ్చి ఆమరణ నిరాహారదీక్షలకు దిగుదామని సూచించారు. చంద్రబాబుకు నిజాయితీ రావాలని కోరుకుంటున్నానని తెలిపారు.

This post is also available in : English

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*