50 ఏళ్ల తర్వాత బయటపడ్డ సైనికుడి మృతదేహం

విమాన ప్రమాదంలో చనిపోయిన ఓ సైనికుడి మృతదేహం దాదాపు 50 ఏళ్ల తర్వాత లభ్యమైంది. పర్వాతారోహకులు హిమాచల్ ప్రదేశ్ లోని మంచుకొండలపై ఉన్న చెత్తను శుభ్రం చేస్తుండగా డెడ్ బాడీ బయటపడింది. తొలుక ధాకా గ్లేసియర్ బేస్ క్యాంప్ దగ్గర విమాన శకలాన్ని గుర్తించారు. తర్వాత కొద్ది దూరంలోనే సైనికుడి మృతదేహాన్ని కనుగొన్నారు. విమాన శకలంతో పాటు మృతదేహాన్ని ఫొటో తీసి ఆర్మీ హై ఆల్టిట్యూడ్ వెల్ఫేల్ స్కూల్ కు పంపారు. దాన్ని పరిశీలించిన అధికారులు ఆ ఘటన ఇప్పటిది కాదని తెలిపారు. 1968లో జరిగిన విమాన ప్రమాదంగా గుర్తించారు. ఆ డెడ్ బాడీ సైనికుడిదని చెప్పారు.

1968 ఫిబ్రవరి 7న చంఢీగఢ్ నుంచి 98 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బందితో బయలుదేరిన విమానం రోహ్ తంగ్ సమీపంలో కూలిపోయింది. కానీ దాని జాడమాత్రం తెలియరాలేదు. 35 ఏళ్ల తర్వాత 2003లో ఓ విమాన శకలాన్ని గుర్తించారు. అప్పటి నుంచి 2017 వరకు గాలిస్తునే ఉన్నారు. ఈ ఆపరేషన్‌ లో ఐదు మృతదేహాలు లభ్యమయ్యాయి. మంచులో కూరుకుపోయిన మిగతా డెడ్ బాడీల కోసం వెతుకుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*