6జీబీ ర్యామ్.. భారీ బ్యాటరీ.. ఎంఐ మ్యాక్స్3ని లాంచ్ చేసిన షియోమీ

చైనా మొబైల్ మేకర్ షియోమీ నుంచి మరో అదిరిపోయే ఫోన్ మార్కెట్లోకి వచ్చేసింది. 6జీబీ ర్యామ్, 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ కలిగిన బడ్జెట్ ఫ్యాబ్లెట్‌ను చైనాలో లాంచ్ చేసింది. 6.9 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, వెర్టికల్ డ్యూయల్ రియర్ కెమెరా కలిగిన ‘ఎంఐ మ్యాక్స్ 3’ డార్క్ బ్లూ, డ్రీమ్ గోల్డ్, మెటియోరిట్ బ్లాక్ రంగుల్లో అందుబాటులో ఉంది.
ఎంఐ మ్యాక్స్3 ధర చైనా కరెన్సీలో సీఎన్‌వై 1,699. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.17,300. ఈ ధర బేస్ వేరియంట్ అయిన 4జీబీ ర్యామ్, 64 జీబీ వేరియంట్‌కు మాత్రమే. 6జీబీ, 128జీబీ వేరియంట్ ధర రూ.20,400 ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రీ ఆర్డర్లపై మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ఫోన్ ఈనెల 20 నుంచి అందుబాటులోకి రానుంది.
స్పెసిఫికేషన్లు: డ్యూయల్ సిమ్ (నానో), 6.9 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ఎస్ఓసీ చిప్‌సెట్, 12 ప్లస్ 5 మెగాపిక్సల్ రియర్ డ్యూయల్ కెమెరా, 8 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా, 64 జీబీ, 128 జీబీ ఇన్‌బిల్ట్ వేరియంట్లు ఉన్నాయి. 256 జీబీ వరకు పెంచుకునే వెసులుబాటు ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*