అసోం స్పోర్ట్స్ అంబాసి‌డర్‌గా హిమ దాస్

ఐఏఏఎఫ్ వరల్డ్ అండర్-20 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం గెలిచి దేశానికి బంగారు పతకం అందించిన తొలి మహిళా అథ్లెట్‌గా రికార్డులకెక్కిన హిమ దాస్‌కు అరుదైన గౌరవం లభించింది. ఆమెను స్పోర్ట్స్ అంబాసిడర్‌గా నియమిస్తున్నట్టు అసోం ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్ ప్రకటించారు. ఫ్రాన్స్‌లో జరిగిన ఐఏఏఎఫ్ చాంపియన్‌షిప్‌లో 400 మీటర్ల ఫైనల్ రేస్‌లో హిమ దాస్ స్వర్ణ పతకం సాధించింది. 51.46 సెకన్లలోనే గమ్యాన్ని చేరుకున్న హిమ దేశం గర్వించేలా చేసింది. ఆమె గెలుపుతో దేశం సంబరాలు చేసుకుంది. హిమను అభినందించిన ముఖ్యమంత్రి ‌హిమ దాస్‌ను రాష్ట్ర స్పోర్ట్స్ అంబాసిడర్‌గా నియమించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*