నేను తప్పు చేయనంత వరకు ఎవరికీ భయపడను

ఆంధ్రప్రదేశ్ కి జరిగిన అన్యాయం గురించి తెలిపేందుకే పార్లమెంట్లో అవిశ్వాసం పెట్టామని చంద్రబాబు అన్నారు. మెజార్టీకి, నైతికతకు మధ్య జరుగుతున్న పోరాటమిది అని అభివర్ణించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రధాని మోడీ చాలాసార్లు చెప్పి నిర్లక్ష్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 15 ఏళ్ల తర్వాత మేం అవిశ్వాసం పెట్టామని చంద్రబాబు ప్రకటించారు. అవిశ్వాస తీర్మానానికి మద్దతిచ్చిన పార్టీలకు కృతజ్ఞతలు తెలిపారు.

హామీలు అమలు చేయాల్సిన బాధ్యత ప్రధానికి లేదా అని బాబు ప్రశ్నించారు. ఢిల్లీ చుట్టూ 29 సార్లు ప్రదక్షిణ చేశానని అన్నారు. కాంగ్రెస్ను విమర్శించడం కాదు.. మీరేం చేశారో చెప్పండని కేంద్రాన్ని నిలదీశారు. ఢిల్లీని మించిన రాజధానిని నిర్మిస్తామని మోడీ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. తల్లిని.. బిడ్డను కాపాల్సిన బాధ్యత లేదా అని ప్రశ్నించారు.

ఏపీకి న్యాయం జరుగుతుందనే మేము కేంద్రంలో భాగస్వామిగా చేరామన్న బాబు.. హోదా విషయంలో 14వ ఆర్థిక సంఘం పేరుతో తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. 11 రాష్ట్రాలకు రాయితీలు ఇస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.తనపై మోడీ చేసిన వ్యాఖ్యలు బాధించాయని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరంలో 57 శాతం పనులు పూర్తయ్యాయని చెప్పుకొచ్చారు. కేంద్రం ఇచ్చిన రూ.1500 కోట్లతో కేబుల్ వర్క్ కూడా పూర్తి కాదని ఎద్దేవా ఆచేశారు. మంజూరు చేసిన నిధులను కూడా వెనక్కి తీసుకోవడమేంటని బాబు ప్రశ్నించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*