గల్లాను అభినందించిన చంద్రబాబు

పార్లమెంట్ లో 5 కోట్ల ఆంధ్రుల ఆవేదన ను వినిపించిన గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ను సీఎం చంద్రబాబు అభినందించారు. డిల్లీ వెళ్లి న సీఎం చంద్రబాబు అవిశ్వాసానికి మద్దతు ఇచ్చిన నేతలను కలిశారు. ఈ సందర్భంగా పార్లమెంటు లో అద్బుతమైన ప్రసంగం చేసిన ఎంపీ గల్లా జయదేవ్ ను ప్రత్యేకంగా అభినందించారు. గత పార్లమెంట్ సమావేశాలలో కూడా మిస్టర్ మోడి అంటూ లోక్ సభ లోని సభ్యులతో పాటు దేశ ప్రజలు దృష్టి ని ఆకర్షించిన గల్లా జయదేవ్ మరోసారి దేశ ప్రజలు దృష్టి ని ఆకర్షించారు. నిన్న కేంద్రం పై జరిగిన అవిశ్వాస తీర్మానం చర్చలో అరగంటకు పైగా ఏక దాటి కి ఏపి సమస్యలు ను స్పష్టంగా సభలో గల్లా జయదేవ్ వినిపించారు. దీంతో గల్లా ప్రసంగం అద్భుతంగా ఉందని టిడిపి శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. దీనిలో భాగంగా నేడు డిల్లీ వెళ్లిన సీఎం చంద్రబాబు గల్లా జయదేవ్ ను భుజం తట్టి అభినందించారు. చక్కగా మాట్లాడవని , తెలుగు ప్రజల ఆవేదన ను అర్దవంతంగా సభకు వివరించావని మెచ్చుకున్నారు. ఇదే పంధాలో కేంద్రం పై రాజీలోని పోరాటం చేయాలని సూచించారు

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*