అప్పుడు హరీష్ రావ్ కిందపడితే చప్పట్లు కొడదామనుకున్నా!

కరీంనగర్ వాణినికేతన్ విద్యాసమితి స్వర్ణోత్సవాల్లో గవర్నర్ నరసింహన్ ప్రసంగం నవ్వులు పూయించింది. పదవులు ఉన్నప్పుడు ఎవరైనా గౌరవిస్తారు. కానీ మనిషిగా ఎల్లప్పుడూ గౌరవం పొందాలని నరసింహన్ అన్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి రాష్ట్ల్ర అసెంబ్లీలో తన ప్రసంగాన్ని హరీష్ రావు ఎలా అడ్డుకోవాలని చూశారో గుర్తుచేశారు. వెనక బెంచీ నుంచి బల్లలపై నడుచుకుంటూ తనపైకి దూసుకు వస్తున్న హరీష్ రావుని చూసి.. అతను ఒకవేళ కింద పడితే చప్పట్లు కొడుదామనుకున్నా అనగానే.. సభ గొల్లున నవ్వింది.

తన చిన్ననాటి అల్లరి పనులను నరసింహన్ గుర్తు చేసుకున్నారు. జీవితానికి మంచి పునాది పడేది పాఠశాల స్థాయిలోనే అన్నారు. విద్యార్థులు ఉన్నత స్థానంలో ఉన్నప్పుడే గురువులకు నిజమైన సంతోషమన్నారు గవర్నర్.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*