ఐఫోన్ యూజర్లకు భారీ షాక్.. త్వరలోనే కనెక్షన్ కోల్పోనున్న యూజర్లు!

దేశంలోని ఐఫోన్ యూజర్లు ఇది చేదు వార్తే. త్వరలోనే వారంతా కనెక్షన్లు కోల్పోనున్నారు. టెలికం నియంత్రణ మండలి ట్రాయ్ గురువారం కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. ఇవి కనుక అమలైతే దేశంలోని యాపిల్ ఐ ఫోన్ వినియోగదారులందరూ తమ కనెక్షన్లను కోల్పోతారు. టెలికం కమర్షియల్ కమ్యూనికేషన్ కస్టమర్ ప్రిఫరెన్స్ రెగ్యులేషన్, 2018ను ట్రాయ్ ప్రకటించింది. అయాచితమైన కమర్షియల్ కమ్యూనికేషన్ సమస్యలను అణచివేయడమే లక్ష్యంగా ఈ నిబంధనలను తీసుకొచ్చింది. అంటే యూజర్లను ఇబ్బంది పెట్టే కాల్స్, మెసేజ్‌లపై ఉక్కుపాదం మోపనుంది.

అయితే, ఈ నిబంధన యాపిల్‌ కాల్స్‌పై ప్రభావం చూపనుంది. ఎందుకంటే యాపిల్ ఫోన్లకు వచ్చే కాల్స్‌ను అందులోని సాంకేతికత వల్ల ట్రాయ్ గుర్తించలేకపోతోంది. దీంతో ట్రాప్ అభివృద్ధి చేసిన ఓ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాల్సిందిగా యాపిల్‌ను కోరుతున్నా అది నిర్లక్ష్యం చేస్తోంది. దీంతో గత కొన్ని రోజులుగా యాపిల్-ట్రాయ్ మధ్య యుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలో వినియోగారులను దృష్టిలో సరికొత్త నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చింది.

పెస్కీ కాల్స్, మెసేజ్‌ల నుంచి వినియోగదారులను రక్షించేందుకు ఓ యాప్‌ను అభివృద్ధి చేసి గూగుల్ ప్లే స్టోర్‌లో పెట్టింది. ‘డునాట్ డిస్టర్బ్’ కోసం ఇందులో రిజిస్టర్ చేసుకోవచ్చు. ట్రాయ్ నిబంధనలకు టెలికం కంపెనీలు విదేయులై ఉండాల్సిందే. డీఎన్‌డీని ఉల్లంఘించిన వారిపై ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేసే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం ఈ యాప్ ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉండగా ఐవోఎస్‌లోనూ తీసుకురావాలని ట్రాయ్ యోచిస్తోంది.

అయితే, థర్డ్ పార్టీ యాప్‌లను యాపిల్ అంగీకరించకపోవడంతోనే ఇప్పుడు ‌చిక్కొచ్చి పడింది. యాపిల్ యూజర్ల కాల్స్, మెసేజ్‌లను యాక్సెస్ చేసుకునే అవకాశాన్ని యాపిల్ థర్డ్ పార్టీకి ఇవ్వడానికి మొదటి నుంచీ నిరాకరిస్తూ వస్తోంది. దీంతో ట్రాయ్-యాపిల్ మధ్య యుద్ధం మొదలైంది. ఇప్పుడు కొత్తగా ట్రాయ్ అమల్లోకి తీసుకొచ్చిన నిబంధలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. లేదంటే.. దేశంలోని యాపిల్ యూజర్లందరూ తమ కనెక్షన్లను కోల్పోతారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*