కబడ్డీతో చెడుగుడు ఆడుకుంటున్న శ్రీనివాసరెడ్డి

దేశవ్యాప్తంగా ప్రస్తుతం కబడ్డీ కూత మోత మోగుతోంది. క్రికెట్ ధీటుగా రూరల్ గేమ్ కొత్త పుంతలు తొక్కుతోంది. అద్భుతమైన ఆదరణతో జాతీయ క్రీడ అభిమానుల మనసులు గెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఎదురులేని జట్టుగా నీరాజనాలు అందుకుంటున్న భారత కబడ్డీ జట్టు విజయాల్లో సంగారెడ్డి వాసి తనదైన ముద్రవేస్తున్నాడు.

గ్రామీణ మట్టి కోర్టులో కబడ్డీ ఓనమాలు దిద్దాడు. ఆరో ఏట నుంచి చెడుగుడుపై పట్టు సాధించాడు. మండల స్థాయిలో మేటిగా నిలిచాడు. జిల్లా స్థాయిలో మెరిసాడు. రాష్ట్రస్థాయిలో ఎదురులేని ఆటగాడిగా పేరుగాంచాడు. ఇక జాతీయస్థాయిలోనూ సత్తాచాటాడు. ఒక్కో మెట్టు అధిరోహించాడు. ఆటగాడిగా అద్భుతాలు చేసిన తెలంగాణ వాసి కోచ్ గా మరింత ఎత్తుకు ఎదిగాడు, భారత కబడ్డీ సీనియర్ జట్టుకు ప్రధాన కోచ్ గా బాధ్యతలు స్వీకరించాడు. వచ్చే నెలలో ప్రారంభం కానున్న ఏషియన్ గేమ్స్ లో భారత జట్టుకు గోల్డ్ మెడల్ సాధించడమే లక్ష్యంగా ఆటగాళ్లకు శిక్షణ ఇస్తున్నాడు.

అంతర్జాతీయ కబడ్డీలో యంగెస్ట్ కోచ్ గా పేరు గాంచిన లింగంపల్లి శ్రీనివాస రెడ్డిది.. సంగారెడ్డి జిల్లా కంది మండలం ఉత్తరపల్లి గ్రామం.. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన శ్రీనివాసరెడ్డి స్కూల్ స్థాయిలోనే కబడ్డీ పట్ల మక్కువ పెంచుకున్నాడు. కబడ్డీలో శ్రీనివాస రెడ్డి ప్రతిభను ముందుగా గుర్తించిన కోచ్ సుబ్బారావు అతన్ని మరింత రాటుదేలేలా శిక్షణ ఇచ్చాడు, దీంతో రెడ్డి జిల్లాస్థాయిలో జరిగిన పలు టోర్నీలో సత్తా చాటాడు, ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ జట్టులో తనదైన ముద్ర వేశాడు. ఇక రాష్ట్రస్థాయి టోర్నీలో రాణించి జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. దాదాపు పదేళ్లపాటు జాతీయ జట్టులో కీలక ప్లేయర్ గా సేవలు అందించాడు. తర్వాత కోచ్ మారాడు.
సౌత్ కొరియా జట్టుకు కోచ్ గా ఎంపికైన శ్రీనివాస రెడ్డి అక్కడ అద్భుతమే చేశాడు. 2014 ఎషియన్ గేమ్స్ లో సౌత్ కొరియా బ్రాంజ్ మెడల్ సాధించడంలో కీలక పాత్రపోషించాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా జాతీయ కబడ్డీ జట్టుగా హెడ్ కోచ్ గా సేవలు అందించాడు.

ఏకంగా భారత జాతీయ సీనియర్ కబడ్డీ జట్టుకు హెడ్ కోచ్ గా బాధ్యతలు స్వీకరించాడు. సంగారెడ్డి జిల్లా కంది మండలం ఉత్తరపల్లికి చెందిన లింగంపల్లి శ్రీనివాసరెడ్డి, వచ్చే నెలలో ఆరంభం కాబోతున్న ఏషియన్ గేమ్స్ లో భారత్ కు గోల్డ్ మెడల్ అందించడమే లక్ష్యంగా ఆటగాళ్లకు శిక్షణ ఇస్తున్నాడు. జట్టుకైతే కొన్నేళ్ల పాటు ఆడాడో..ఆ జట్టుకే ఇప్పుడు అతడు ప్రధాన కోచ్.. ఇక ఏషియన్ గేమ్స్ గోల్డ్ మెడల్ సాధించడమే అతని కల.. కాని అనివార్య కారణాలతో అతని ఆశ తీరలేదు. ఆటగాడిగా తీరకపోయినా కోచ్ గా ముందుగా రచ్చ గెలిచాడు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*