ఆ ముగ్గురికి గ్రీన్ ఛాలెంజ్ విసిరిన ఎంపీ కవిత

డిప్యూటీ సీఎం మహమూద్ అలీకి ఎంపీ కవిత గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ, సినీ దర్శకుడు రాజమౌళిని ఈ చాలెంజ్ కు నామినేట్ చేశారు ఆ ముగ్గురు ఒక్కొక్కరు మూడు మొక్కల చొప్పున నాటాలని ఆమె అన్నారు. కవిత విసిరిన సవాల్ స్వీకరిస్తున్నామని వాళ్లు ప్రకటించారు. హరితహారం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ విసిరిన ఛాలెంజ్ లో భాగంగా ఎంపీ కవిత తన ఇంటి వసారాలో మూడు మొక్కలు నాటారు. అనంతరం మరో ముగ్గురికి ఆమె ఛాలెంజ్ విసిరారు.

మొక్కలు నాటే కార్యక్రమం పోటీతత్వంతో సాగేలా చేయడం గ్రీన్ ఛాలెంజ్ ముఖ్య ఉద్దేశమన్నారు కవిత. భవిష్యత్ తరాలకు మేలు చేసేందుకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటడాన్ని అలవాటుగా చేసుకోవాలని ఆమె కోరారు. నాటడమే కాదు..ఆ మొక్కల సంరక్షణ బాధ్యత కూడా తీసుకోవాలని కవిత కోరారు.

ఈనెల 27న దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్ధంతిని పురస్కరించుకొని ఇగ్నైటింగ్స్ మైండ్స్, వాక్ ఫర్ వాటర్ స్వచ్ఛంద సంస్థలు తెలంగాణ హరితహారంలో భాగంగా ఈ గ్రీన్ చాలెంజ్ కార్యక్రమాన్ని వినూత్నంగా నిర్వహించబోతున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*