బ్రిక్స్‌ సమావేశాలకు ప్రధాని మోడీ

ప్రధాని నరేంద్రమోడీ బ్రిక్స్‌ సమావేశాలకు హాజరు కానున్నారు. సౌత్ ఆఫ్రికాలో ఈ 25 నుంచి 27 వరకు బ్రిక్స్ సమావేశాలు జరగనున్నాయి. ఈసారి అంతర్జాతీయ శాంతి, రక్షణ అంశాలపై చర్చ జరిగనుంది. అంతకుముందు ప్రధాని మోడీ రువాండా, ఉగాండాలో పర్యటిస్తారు. జూలై 23 నుంచి 27 వరకు ప్రధాని టూర్ మూడు దేశాల్లో ఉంటుంది. మొదట రువాండాలో రెండ్రోజుల పాటు పర్యటిస్తారు. తర్వాత జూలై 24న ఉగాండాకు బయల్దేరి వెళ్లి, అక్కడి నుంచి దక్షిణాఫ్రికాకు వెళ్తారు. బ్రిక్స్‌ సదస్సు సందర్భంగా మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌ పింగ్‌ భేటీ అవుతారని చైనా విదేశాంగ శాఖ వెల్లడించింది. వాణిజ్యంలో అమెరికా వైఖరి సహా ఉమ్మడి ప్రయోజనాలకు సంబంధించిన అంశాలను ఇరువురు నేతలు చర్చించే అవకాశం ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*