రాజస్థాన్ లో ఘోరం.. మళ్లీ కొట్టి చంపారు!

దేశంలో పెరిగిపోతున్న సాముహికదాడుల విషయంలో సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోతోంది. తాజాగా రాజస్థాన్‌ లోని రామ్‌ ఘర్‌ దారుణం జరిగింది. అక్బర్ అనే వ్యక్తి ఆవులను స్మగ్లింగ్‌ చేస్తున్నాడన్న అనుమానంతో కొంతమంది అతన్ని కొట్టి చంపారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. దాడికి పాల్పడిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పోలీసులు మాత్రం ఆవుల స్మగ్లింగ్ కారణంగా హత్య జరిగినట్లు చెప్పలేమని అంటున్నారు.. రాజస్థాన్‌ సీఎం వసుంధరా రాజే ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. ఇలాంటి చర్యలను ఉపేక్షించేది లేదని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*