తొలిసారి భారత మార్కెట్లోకి వివో నెక్స్.. నేటి నుంచి విక్రయాలు ప్రారంభం

వివో సరికొత్త స్మార్ట్‌ఫోన్ వివో నెక్స్ విక్రయాలు నేటి నుంచి భారత్‌లో ప్రారంభం కానున్నాయి. అమెజాన్ ఇండియా, వివో అధికారిక ఆన్‌లైన్ స్టోర్ల ద్వారా కొనుగోలు చేసుకోవచ్చు. ధర రూ.44,990 మాత్రమే. వివో స్టోర్లు, పార్ట్‌నర్ట్ స్టోర్లలో ఆఫ్‌లైన్ ద్వారా కూడా ఈ ఫోన్ అందుబాటులో ఉంది. ఈ వారం మొదట్లోనే విడుదలైన వివో నెక్స్- నెక్స్ సిరీస్‌లో టాప్ ఎండ్ మోడల్. 8జీబీ ర్యామ్, స్నాప్‌డ్రాగన్ 845 ఎస్ఓసీలు ఈ ఫోన్‌లో ప్రధాన ఆకర్షణ.

లాంచింగ్ ఆఫర్లు
వివో నెక్స్ భారత ధర రూ.44,990. అమెజాన్ ఇండియా, అధికారిక వివో ఈ-స్టోర్ల నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. గురువారం నుంచే ప్రీఆర్డర్లు కూడా ప్రారంభమయ్యాయి. లాంచింగ్ ఆఫర్‌లో భాగంగా పాత ఫోన్ల ఎక్స్‌చేంజ్‌పై వివో రూ.5‌00 రాయితీ ఇస్తోంది. వన్‌టైమ్ ఫ్రీ స్క్రీ‌న్ రీప్లేస్‌మెంట్, 12 నెలలపాటు నోకాస్ట్ ఈఎంఐ, హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిక్ కార్టుతో కొనుగోళ్లపై రూ.4వేల తక్షణ డిస్కౌంట్, రిలయన్స్ జియో నుంచి ఉచిత ప్రీమియం సెక్యూరిటీ సబ్‌స్క్రిప్షన్, రూ.22,495తో బైబ్యాక్ గ్యారెంటీ తదితర ఆఫర్లు ప్రకటించింది.

వివో నెక్స్ స్పెసిఫికేషన్లు
డ్యూయల్ సిమ్, ఫన్‌టచ్ ఓఎస్ 4.0 ఆధారిత 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం, 6.59 అంగుళాల ఫుల్ హెచ్‌డీ సూపర్ అమోలెడ్ అల్ట్రా ఫుల్ వ్యూ డిస్‌ప్లే, అల్ట్రా థిన్ బేజెల్ డిజైన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ఎస్ఓసీ, 8జీబీ ర్యామ్, పాపప్ సెల్ఫీ కెమెరా, 8+12 మెగాపిక్సల్ రియర్ డ్యూయల్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెకండరీ కెమెరా తదితర ఫీచర్లు ఉన్నాయి. 128 జీబీ ఆన్‌బోర్డ్ మెమొరీ, అవసరం మేరకు మెమొరీని పెంచుకునే వెసులుబాటు ఉన్న ఈ ఫోన్‌లో 4000 ఎంఏహెచ్ బ్యాటరీని ఉపయోగించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*