22-07-2018 నుండి 28-07-2018 వరకు వారఫలాలు

మేషరాశి :  ఈవారం మొత్తం మీద కుటుంబపరమైన విషయాలకు సమయం ఇస్తారు, పెద్దలతో కలిసి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. సంతానం వలన పెద్దల నుండి గుర్తింపు లభిస్తుంది. అనుకోకుండా ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. ఎవ్వరితోను మాటపట్టింపులకు వెళ్ళకండి, గతంలో రావాల్సిన ధనం కాస్త ఆలస్యంగా చేతికి అందుటకు అవకాశం ఉంది. సోదరులతో కలిసి చేపట్టిన పనులు మధ్యలో ఆగిపోయే అవకాశం ఉంది. అనుకోకుండా పనులు మీద పడే అవకాశం ఉంది, భాద్యతలు పెరుగుటకు ఆస్కారం ఉంది.

వృషభరాశి : వారం మొత్తం మీద ముఖ్యమైన పనులకు సమయం ఇవ్వడం మంచిది. ఆర్థికపరమైన విషయాల్లో పెద్దలనుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. వ్యాపార పరమైన విషయాల్లో మిశ్రమ ఫలితకలు పొందుతారు. సోదరులతో చేపట్టిన చర్చలు ఆశించిన మేర ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంది. విదేశీప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. సంతానపరమైన విషయాల్లో పెద్దలనుండి వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకోవడం మేలు. నూతన వాహనాలను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. తల్లితరుపు బంధువులను కలుసుకునే అవకాశం ఉంది, వారి నుండి లబ్దిచేకూరుతుంది.

మిథునరాశి: ఈవారం మొత్తం మీద పెద్దలను కలుస్తారు, చర్చలు విఫలం అయ్యే అవకాశం ఉంది. గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన సమస్యలు తిరిగి ఇబ్బందిపెట్టుటకు అవకాశం ఉంది, జాగ్రత్త. నూతన నిర్ణయాలకు అలాగే ఆలోచనలకు ప్రాధాన్యం ఇస్తారు. వ్యాపారపరమైన విషయాల్లో ఒత్తిడి ఉన్న కాస్త ఊరట చెందుటకు అవకాశం ఉంది. కొన్ని కొన్ని విషయాల్లో మీ మాటతీరు వివాదాలకు దారితీస్తుంది. సోదరులతో చర్చలు చేయుటకు అవకాశం ఉంది. ఆరోగ్యపరమైన విషయాల్లో కాస్త జాగ్రత్త అవసరం. సామాజికపరమైన విషయాల్లో వ్యతిరేకతను కలిగి ఉంటారు. సాధ్యమైనంత మేర వివాదాలకు దూరంగా ఉండుట సూచన.

కర్కాటకరాశి : ఈవారం మొత్తం మీద చిన్న చిన్న విషయాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం వలన మేలుజరుగుతుంది. తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేసే ఆస్కారం ఉంది. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. వారినుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. స్త్రీ పరమైన విషయాల్లో కాస్త నిదానంగా వ్యవహరించుట సూచన. అనుకోకుండా ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. సంతానపరమైన విషయంలో నూతన విషయాలు తెలుస్తాయి. ఆర్థికపరమైన విషయాల్లో బాగానే ఉంటుంది. మిత్రులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. నూతన పరిచయాలకు అవకాశం ఉంది.

సింహరాశి :  ఈవారం మొత్తం మీద ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటును కలిగి ఉంటారు. ఉద్యోగంలో అధికారులకు అనుగుణంగా నడుచుకొనుట సూచన. వ్యాపారపరమైన విషయాల్లో ఆశించిన మేర ఫలితాలు వస్తాయి. పెద్దలతో మీకున్న పరిచయం మరింతగా బలపడే ఆస్కారం ఉంది. వారినుండి ఆశించిన మేర సహకారం పొందుతారు. మానసిక పరమైన ఆందోళన కలిగి ఉంటారు, ఈ విషయంలో జాగ్రత్తగా ఉండుట మంచిది. సాధ్యమైనంత మేర అనవసరమైన విషయాలకు దూరంగా ఉండుట మంచిది. కుటుంబంలో ఒకరు సంతోషకరమైన వార్తలను పొందుతారు. దైవపరమైన పూజలలో పాల్గొనే ప్రయత్నం మంచిది.

కన్యారాశి : ఈవారం మొత్తం మీద మీ ఆలోచనలన వలన పెద్దలనుండి ప్రశంశలు పొందుతారు. వ్యాపారపరమైన విషయాల్లో నూతన అవకాశాలు పొందుతారు. నూతన పెట్టుబడులకు అవకాశం కలదు. గతంలో చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేసే అవకాశం ఉంది. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతాయి. నూతన ఉద్యోగప్రయత్నాలు కలిసి వస్తాయి. కుటుంబవ్యవహారాల్లో ఆశించిన మార్పులకు ఆస్కారం ఉంది. నూతన వస్తువులను కొనుగోలు చేయుటకు అవకాశం ఉంది. విదేశాల నుండి బంధవులు వచ్చే అవకాశం ఉంది, వారినుండి నూతన విషయాలు తెలుస్తాయి.

తులారాశి: ఈవారం మొత్తం మీద సాధ్యమైనంత మేర ఆలోచనలను అలాగే చర్చలను తగ్గించుకోవడం వలన మేలుజరుగుతుంది. చేపట్టిన పనులను కాస్త ఆలస్యంగా పూర్తిచేసే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు, కొన్ని కొన్ని సార్లు వేచిచూసే ధోరణి మేలుచేస్తుంది. ఉద్యోగంలో పనిఒత్తిడి ఉంటుంది, కాస్త ప్రణాలిక కలిగి ఉండి ముందుకు వెళ్ళండి, మంచిది. మిత్రులనుండి వచ్చిన సూచనలను పెడచెవిన పెట్టడం ద్వారా నూతన సమస్యలు పొందుతారు. మీ మాటతీరును సరిచేసుకోవడం వలన మేలుజరుగుతుంది. ఆరోగ్యం విషయాల్లో అనవసరమైన భావనలు వీడండి.

వృశ్చికరాశి : ఈవారం మొత్తమ్మీద బంధువులతో అధికభాగం సమయం గడుపుటకు అవకాశం ఉంది, వారినుండి ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటారు. గతంలో మీరు చేసిన సహాయానికి తగిన ప్రతిఫలం పొందుతారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో తొందరపాటు వద్దు.  కుటుంబపరమైన విషయాల్లో కీలకమైన ఆలోచనల దిశగా అడుగులు ఉంటాయి. వ్యాపారపరమైన సంబంధాల్లో చర్చలకు అవకాశం ఉంది. రుణపరమైన ఇబ్బందులు తప్పకపోవచ్చును. సొంత నిర్ణయాలాబ్ కన్నా అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. విదేశాల్లో ఉన్న వారికి ప్రమోషన్  లేక స్దానచలన అవకాశం ఉంది.

ధనస్సురాశి: ఈవారం మొత్తం మీద సాధ్యమైనంత మేర సమయం చర్చలకు ఇస్తారు. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తచేయుటకు ఆస్కారం ఉంది. ఆరోగ్యపరమైన విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండుట సూచన. సంతానపరమైన విషయాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. విలువైన వస్తువులను నస్టపోయే ఆస్కారం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండుట మంచిది. బంధువులను కలుస్తారు, వారితో సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. నూతన ఉద్యోగప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపారపరమైన విషయాల్లో నూతన పెట్టుబడులకు అవకాశం ఉంది.

మకరరాశి : ఈవారం మొత్తం మీద ఉద్యోగంలో అధికారుల నుండి ప్రశంశలు పొందుతారు, ఆశించిన మేర అభివృద్ధిని పొందుతారు. ప్రయాణాలు చేయునపుడు నూతన పరిచయాలకు అవకాశం ఉంది. మిత్రులతో మీ ఆలోచనలను పంచుకుంటారు. వారితో కలిసి నూతన ప్రయత్నాలు మొదలు పెట్టుటకు అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో అభివృద్ధిని పొందుతారు. సోదరులతో చేపట్టిన చర్చలు ఒక కొలిక్కి వస్తాయి. జీవితభాగస్వామితో విభేదాలు రావడానికి ఆస్కారం ఉంది, సర్దుబాటు వ్యవహారం విఫలం అయ్యే అవకాశం ఎక్కువ. ఆర్థికపరమైన విషయాల్లో గతంలో చేసిన ప్రయత్నాలు ముందుకు సాగుతాయి.

కుంభరాశి : ఈవారం మొత్తం మీద చిన్న చిన్న విషయాలకే హడావుడి చేసే అవకాశం ఉంది. అనుకోకుండా ఖర్చులు పెరుగుటకు ఆస్కారం ఉంది, జాగ్రత్త. ప్రయాణాలు చేయునపుడు ఇబ్బందులు తప్పక పోవచ్చును. అధికసమయం అనవసరమైన చర్చలకు కేటాయించే అవకాశం ఉంది. పెద్దల అభిప్రాయాలను ఆలోచనలను అశ్రద్ధ చేయకండి, పాటించే ప్రయత్నం చేయుట మంచిది. నూతన వ్యవహారిక విషయాల్లో స్పష్టమైన ప్రణాళిక మేలుచేస్తుంది. విదేశీప్రయాణ ప్రయత్నాలు చేయువారికి అనుకూలమైన సమయం. ఆరోగ్యం విషయాల్లో ఏమాత్రం అలసత్వం చేయక, వైద్యున్ని సకాలంలో సంప్రదించుట మేలుచేస్తుంది.

మీనరాశి : ఈవారం మొత్తం మీద మిశ్రమఫలితాలు పొందుటకు ఆస్కారం ఉంది. తలపెట్టిన పనులను పూర్తిచేయుటకు సమయం తీసుకొనే అవకాశం ఉంది. మీ మాటతీరు మిమ్మల్ని ఇబ్బందిలోకి నెట్టే అవకాశం ఉంది. వాహనాల వలన అనుకోని ఖర్చులు పెరుగుటకు ఆస్కారం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవడం వలన మేలుజరుగుతుంది. దూరప్రదేశ ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. సోదరుల నుండి నూతన విషయాలు తెలుస్తాయి. ఆరోగ్యపరమైన విషయంలో కాస్త ఆందోళన చెందుటకు అవకాశం ఉంది. సమయాన్ని సరిగా వాడుకొనే ప్రయత్నం చేయుట ఉత్తమం.
 

డా. టి. శ్రీకాంత్ 

వాగ్దేవిజ్యోతిషాలయం
బి. టెక్(మెకానికల్), ఎం. ఎ (జ్యోతిషం),
ఎం. ఎ (వేదాంగజ్యోతిషం)మాస్టర్స్ ఇన్ వాస్తు , పి జి డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు,సంఖ్యాశాస్త్రం. పి హెచ్ డి (వేదాంగజ్యోతిషం)   ,(ఎమ్ ఎస్ సి (సైకాలజీ ))
9989647466

8985203559

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*