26 నుంచి అందుబాటులోకి ఆసుస్ జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రొ ఎం1

ఆసుస్ జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రొ ఎం1 6జీబీ వేరియంట్ ఈ నెల 26 నుంచి భారతీయ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. ఫ్లిప్‌కార్ట్‌‌లో ఎక్స్‌క్లూజివ్‌గా అందుబాటు ఉండనుంది. 6జీబీ ర్యామ్ వేరియంట్ ధర భారత్‌లో రూ.14,999 ఉండనుంది. ఈ నెల మొదట్లో జెన్‌ఫోన్ 5జడ్‌ను లాంచ్ చేసిన తైవాన్ కంపెనీ మూడో వారంలో జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రొ ఎం1ను విడుదల చేయనున్నట్టు చెప్పింది.

జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రొ ఎం1 స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే 6 జీబీ ర్యామ్, 16 + 5 మెగాపిక్సల్ రియర్ డ్యూయల్ కెమెరా, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా అదనపు ఆకర్షణ కానుంది. డీప్‌సీ బ్లాక్, గ్రే కలర్ వేరియంట్లలో అందుబాటులో ఉంది.
స్పెసిఫికేషన్లు: 5.99 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ఐపీఎస్ ఫుల్ వ్యూ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 8.1 ఓరియా ఓఎస్, ఆక్టాకోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 636 ఎస్ఓసీ, 3జీబీ, 4జీబీ, 6జీబీ ర్యామ్ 32జీబీ, 64 జీబీ ఇంటర్నల్ మెమొరీతో మూడు వేరియంట్లు, ఎస్డీ కార్డు ద్వారా 2 టీబీ వరకు పెంచుకునే వెసులుబాటు ఉన్నాయి.

3జీబీ ర్యామ్, 4జీబీ ర్యామ్ వేరియంట్లలో 13 మెగాపిక్సల్+5 మెగాపిక్సల్ డ్యూయల్ రియర్ కెమెరా, 8 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా ఉండగా, 6జీబీ ర్యామ్ వేరియంట్‌లో 16 మెగాపిక్సల్ + 5 మెగాపిక్సల్ రియర్ కెమెరా, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా సెటప్ ఉన్నాయి. 5000 ఎంఏహెచ్ సామర్థ్యం కల బిగ్ బ్యాటరీని ఉపయోగించారు. ఇతర పీచర్ల విషయానికి వస్తే 4జీ ఎల్‌టీఈ, వైఫై 802.11, వైఫై డైరెక్ట్, బ్లూటూత్ వి4.2, మైక్రో యూఎస్బీ, 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ సెన్సార్ ఉన్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*