వైవిధ్య‌మైన చిత్రాల‌ను తెలుగు ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌ని మ‌రోసారి నిరూపించిన చిత్రం `ఆట‌గ‌ద‌రా శివ‌

తెలుగు సినిమాల్లో వైవిధ్య‌మైన సినిమాలు ఎక్కువ‌గా వ‌స్తున్నాయి. కాన్సెప్ట్ బేస్డ్ చిత్రాల‌ను ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నారు. దీంతో కంటెంట్ ప్ర‌ధాన‌మై చిత్రాలు రూపొందుతున్నాయి. అలా కాన్సెప్ట్ బేస్డ్ మూవీగా రూపొంది ఈ శుక్ర‌వారం విడుద‌లైన చిత్రం `ఆట‌గ‌ద‌రా శివ‌`. `ప‌వ‌ర్‌`, `లింగా`, `బ‌జ‌రంగీ భాయీజాన్‌` వంటి భారీ చిత్రాల నిర్మాత రాక్‌లైన్ వెంక‌టేశ్ నిర్మాణంలో `ఆ న‌లుగురు`, `మ‌ధు మాసం`, `అంద‌రి బంధువ‌య‌`తో ప్రేక్ష‌కుల భావోద్వేగాల‌ను స్పృశించిన సెన్సిటివ్‌ ద‌ర్శ‌కుడు చంద్ర‌సిద్ధార్థ్  ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం రూపొందింది. విడుద‌ల‌కు ముందే సినిమా కొన్ని అంచ‌నాల‌తో విడుద‌లైన `ఆట‌గ‌ద‌రా శివ‌` తొలి ఆట నుండే పాజిటివ్ టాక్‌తో స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ అవుతోంది. ఈ సంద‌ర్భంగా….
ద‌ర్శ‌కుడు చంద్ర‌సిద్ధార్థ్ మాట్లాడుతూ – “తాత్విక సిద్ధాంతాన్ని అంత‌ర్లీనంగా.. ఓ క‌థాంశంతో సినిమాగా రూపొందించ‌డం ఆనందంగా ఉంది. డిప‌రెంట్ చిత్రాల‌ను తెలుగు ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌ని మ‌రోసారి ఈ సినిమాతో ప్రూవ్ అయ్యింది. ఉద‌య్‌శంక‌ర్‌, దొడ్డ‌న్న న‌ట‌నకు సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌స్తుంది. ఇలాంటి సినిమాలు వ‌స్తే ఇండ‌స్ట్రీ బావుంటుంది. ఈ చిత్రాన్ని ఆద‌రిస్తున్న ప్రేక్ష‌కుల‌కు థాంక్స్‌“ అన్నారు.
రాక్‌లైన్ వెంక‌టేశ్ మాట్లాడుతూ “ఆట‌గ‌ద‌రా శివ` వంటి విల‌క్ష‌ణ‌మైన సినిమాను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించాల‌నే నా సంకల్పం నేర‌వేరింది. రెగ్యుల‌ర్‌కి భిన్నంగా కంటెంట్ బేస్డ్ సినిమా యూనిక్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ చిత్రం విడుద‌ల ఆట నుండి మంచి రెస్పాన్స్‌ను రాబ‌ట్ట‌కుని విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శిత‌మ‌వుతుంది.  చిన్న చిత్రానికి పెద్ద విజ‌యాన్ని అందించిన తెలుగు ప్రేక్ష‌కుల‌కు కృత‌జ్ఞ‌త‌లు. డిఫ‌రెంట్ చిత్రాల‌ను తెలుగు ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌ని మ‌రోసారి నిరూపిత‌మైంది“ అన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*