బోనాలు జ‌రిగే ఆల‌యాల వ‌ద్ద మొక్క‌ల పంపిణీ

గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో పెద్ద ఎత్తున జ‌రుగునున్న బోనాల పండుగ‌ల సంద‌ర్భంగా అమ్మ‌వార్ల ఆల‌యాల్లో హ‌రిత‌హారం మొక్క‌ల‌ను ప్ర‌త్యేకంగా పంపిణీ చేయాల‌ని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ప్ర‌స్తుత హ‌రిత‌హారంలో 40లక్ష‌ల మొక్క‌ల‌ను నాటాల‌ని జీహెచ్ఎంసీ ల‌క్ష్యంగా నిర్థారించుకోగా, వీటిలో అధికశాతం ఇంటి పెర‌ట్లో నాటేవి ఉన్నాయి. తుల‌సితో స‌హా ప‌లు పండ్ల మొక్క‌లు, దోమ‌ల నివార‌ణ మొక్క‌లు పంచాల‌ని జీహెచ్ఎంసీ బ‌యోడైవ‌ర్సీటి అధికారుల‌ను క‌మిష‌న‌ర్ ఆదేశించారు. బోనాల ఉత్స‌వాల సంద‌ర్భంగా పెద్ద ఎత్తున న‌గ‌ర‌వాసులు హాజ‌ర‌వుతార‌ని, వారికి అవ‌స‌ర‌మైన మొక్క‌లు పంపిణీ చేయ‌డానికి చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని తెలియ‌జేశారు. దీంతో పాటు ఆల‌యాలు, ప్రార్థ‌నాస్థ‌లాల‌లో ఖాళీ స్థ‌లాలు ఉంటే మొక్క‌లు నాటాల‌ని ఇందుకుగాను ఆయా క‌మిటీల స‌హాయ స‌హ‌కారాల‌ను పొందాల‌ని క‌మిష‌న‌ర్ జ‌నార్థ‌న్‌రెడ్డి సూచించారు.

 

బ‌ల్దియా బొకేల నిషేదం
హ‌రిత‌హారంపై మ‌రింత స్ఫూర్తిని క‌లిగించేందుకుగాను జీహెచ్ఎంసీలో బొకేల ప్ర‌ధానాన్ని స్వీక‌ర‌ణ‌ను నిషేదించాల‌ని న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ నిర్ణ‌యించారు. ఇటీవ‌ల జ‌రిగిన ఒక కార్య‌క్ర‌మంలో త‌న‌కు బొకేలు ఇస్తుండ‌గా దానిని సున్నితంగా తిర‌స్క‌రించారు. బొకేలా స్థానంలో మొక్క‌ల‌ను అందించాల‌ని, ఈ విష‌యంలో జీహెచ్ఎంసీ ఇత‌ర సంస్థ‌ల‌కు ఆద‌ర్శంగా నిలవాల‌ని ఆయ‌న తెలిపారు. దీనితో బ‌ల్దియాలో ఏ కార్య‌క్ర‌మం జ‌రిగినా మొక్క‌ల‌ను బ‌హుక‌రించాల‌ని క‌మిష‌న‌ర్ డా.బి.జ‌నార్థ‌న్‌రెడ్డి ఆదేశాలు జారీచేశారు. ఇప్ప‌టికే ప్లాస్టిక్ వాట‌ర్ బాటిళ్ల‌ను కార్య‌క్ర‌మాల‌లో నిషేదించ‌డం ద్వారా ప‌లువురి దృష్టిని ఆక‌ర్షించిన క‌మిష‌న‌ర్ బొకేలను అంద‌చేయ‌వ‌ద్ద‌న్న నిర్ణ‌యంతో మ‌రోసారి ఇత‌రుల‌కు ఆద‌ర్శంగా నిలిచింది.

 

హ‌రిత‌హారంలో పాల్గొనే వాలెంటీర్ల‌కు ఆహ్వానం
హైద‌రాబాద్‌ను హ‌రిత హైద‌రాబాద్‌గా రూపొందించడానికిగాను జీహెచ్ఎంసీ చేసే కృషిలో భాగ‌స్వాములు కావ‌డానికి వాలెంటీర్లుగా ప‌నిచేసేందుకు ఆస‌క్తి చూపే యువ‌కులు త‌మ పేర్ల‌ను ఆన్‌లైన్ ద్వారా న‌మోదు చేసుకోవ‌చ్చ‌ని జీహెచ్ఎంసీ తెలిపింది. greenhyderabad.cgg.gov.in అనే వెబ్‌సైట్‌లో హ‌రిత‌హారానికి చెందిన పూర్తి వివ‌రాలు ల‌భ్య‌మ‌వుతాయ‌ని తెలియ‌జేసింది. అదేవిధంగా హ‌రిత‌హారంలో భాగంగా వీధులు, ర‌హ‌దారుల వెంట నాటే మొక్క‌ల ప‌రిర‌క్ష‌ణ‌కు ట్రీగార్డ్‌ల‌ను కార్పొరేట్ సోష‌ల్ రెస్పాన్స్‌బులిటీలో భాగంగా అందించాల‌ని ప‌లు కార్పొరేట్‌, ప‌రిశ్ర‌మ‌లు, వ్యాపార సంస్థ‌ల‌ను కోరిన‌ట్లు, ట్రీగార్డ్‌లు అందుబాటులో ఉండే సంస్థ‌లు, కంపెనీల పేర్ల‌ను వెబ్‌సైట్‌లో ఉంచామ‌ని జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ డా.బి.జ‌నార్థ‌న్‌రెడ్డి తెలిపారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*