మీ అబ్బాయి సీఎం అయితే ఏం జరుగుతుందో తలచుకుంటే భయమేస్తోంది: పవన్‌కళ్యాణ్‌

విజయవాడ: తనకు కులపిచ్చి ఉంటే టీడీపీకి ఎందుకు మద్దతిచ్చేవాడినని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ ప్రశ్నించారు. చంద్రబాబు తనపై కులముద్ర వేయాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. లోకేశ్, జగన్‌పైనా విమర్శలు గుప్పించారు.

పవన్ ఇంకా ఏమన్నారంటే…!

మీ అబ్బాయి సీఎం అయితే ఏం జరుగుతుందో తలచుకుంటే భయమేస్తోంది
ఉద్యోగం మీ అబ్బాయికి ఇస్తే చాలదు రాష్ట్రంలో నిరుద్యోగులకు ఇవ్వాలి

రాజధానికి ఇన్ని ఎకరాలెందుకు?
పంటలు పండించే భూములు మీ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఇవ్వాలా

మూడు పంటలు పండే భూములు తీసుకోవడమేంటి?
బలవంతపు భూసేకరణను అంగీకరించేదిలేదు
రైతులు ఇస్తేనే ప్రభుత్వం భూములు తీసుకోవాలి

వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌కు భూములిచ్చిన రైతులు… నేటికీ పరిహారం కోసం ఎదురుచూస్తున్నారు
రైతులకు ఇష్టంలేకుండా భూములు తీసుకుంటే… వారికి అండగా ఉండి పోరాటం చేస్తా
గ్రామసభలు పెట్టి అందరి అనుమతితో భూములు తీసుకోవాలి

బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా… రైతులకు అండగా ముందు వరుసలో నిలబడతా
ప్రభుత్వ బెదిరింపులకు ఎవరూ భయపడొద్దు, నేను అండగా ఉంటా

మరో బషీర్‌బాగ్‌ను చేయాలనుకుంటే…పోలీసుల తూటాకు ముందు నా గుండె చూపుతా
భూములను కొద్దిమంది చేతిలో పెట్టడాన్ని జనసేన వ్యతిరేకిస్తుంది
అవసరానికి మించి భూములు తీసుకోవద్దు
అసైన్డ్‌ భూములకూ భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని పవన్‌ డిమాండ్ చేశారు.

వైసీపీ అధినేత జగన్‌పైనా పవన్ విమర్శలు గుప్పించారు. జగన్‌ను ఏం అడిగినా ముఖ్యమంత్రి అయితేనే చేస్తానంటారని, సమస్య పరిష్కరించాలంటే ముందు అసెంబ్లీకి రావాలన్నారు. విజయవాడలో పవన్ సమక్షంలో వైసిపి, కాంగ్రెస్ నేతలు జనసేనలో చేరారు.

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*