ట్విట్టర్‌లో జగన్‌కు లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్

twitter war

ఏపీ ప్రతిపక్ష నేత జగన్‌కు ఏపీ ఐటీ మంత్రి నారా లోకేశ్ కౌంటర్ ఇచ్చారు. సీఎం చంద్రబాబును విమర్శిస్తూ జగన్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ప్రతి విమర్శ చేశారు. మొదట జగన్ తన ట్వీట్ ద్వారా “చంద్రబాబుగారూ @ncbn .. మీ 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఒక పోరాటంకాని, ఒక ఉద్యమంకాని ఎప్పుడైనా చేశారా?” అని ప్రశ్నించారు. దీనికి బదులుగా మరో ట్వీట్ చేశారు.

నలభై ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రజల కోసం అనేక పోరాటాలు చేసారని అన్నారు. అయితే అన్నిటికంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ముఖ్యమైన పోరాటం ఉందని, అది మీ నాన్న గారు అవినీతి పై చేసిన పోరాటం అని అన్నారు.

మీరు దురాశతో చేసిన అవినీతి, క్విడ్ ప్రో కో డీల్స్,హత్యా రాజకీయాలు,దోపిడీలు,కిడ్నాప్
లు,భూ కబ్జాలు,జైల్లో హత్యలు ఇలా అనేక విషయాల వల్ల మీ తండ్రి చేసిన అవినీతిపై చంద్రబాబు గారు చేసిన పోరాటం అన్నింటికంటే ముఖ్యమైనదని అన్నారు. ఆ పోరాటం మీకు ఇప్పుడు గుర్తుందా? అని లోకేశ్ ప్రశ్నించారు.

This post is also available in : English

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*