జూలై 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న “సాక్ష్యం

బెల్లంకొండ సాయిశ్రీనివాస్, పూజా హెగ్డే జంటగా నటించిన “సాక్ష్యం” చిత్రాన్ని జూలై 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీత సారధ్యంలో రూపొంది ఇటీవల విడుదలైన ఆడియోకి విశేషమైన స్పందన లభించింది. ముఖ్యంగా పంచభూతాల నేపధ్యంలో ప్రముఖ సింగర్లందరూ పాడిన పాటకు విశేషమైన స్పందన లభిస్తోంది.
శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కర్మ సిద్ధాంతం ప్రాముఖ్యతను చాటుతూ.. మనిషి చేసే తప్పులకు ప్రకృతి ఎలా సాక్ష్యంగా నిలిచింది అనేది సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచే అంశం.
సాక్ష్యం ట్రైలర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. 5 మిలియన్ డిజిటల్ వ్యూస్ సాధించిన ఈ ట్రైలర్ యూట్యూబ్ లో ఇంకా హల్ చల్ చేస్తూనే ఉంది. “బాహుబలి” చిత్రానికి వర్క్ చేసిన వి.ఎఫ్.ఎక్స్ టీం “సాక్ష్యం” సి.జి వర్క్ చేస్తుండడం విశేషం.
అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న “సాక్ష్యం” చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తికావచ్చాయి. త్వరలోనే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని జూలై 27న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
నటీనటులు:
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, పూజా హెగ్డే, శరత్ కుమార్, మీనా, జగపతిబాబు, రవికిషన్, అశుతోష్ రానా, మధు గురు స్వామి, జయ ప్రకాష్, పవిత్ర లోకేష్, వెన్నెల కిషోర్.
సాంకేతిక నిపుణులు:
డైరెక్టర్: శ్రీవాస్
బ్యానర్: అభిషేక్ పిక్చర్స్
నిర్మాత: అబిషేక్ నామా
మ్యూజిక్ డైరెక్టర్ : హర్షవర్ధన్ రామేశ్వరన్
కెమెరామెన్: ఆర్థర్ ఏ విల్సన్
ఆర్ట్ : ఏఎస్. ప్రకాష్
ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వర రావ్
డైలాగ్స్: సాయి మాధవ్ బుర్రా
యాక్షన్: పీటర్ హెయిన్
పి.ఆర్.ఓ: వంశీ – శేఖర్
లిరిక్స్: అనంత శ్రీరామ్
ఆడియో: జంగ్లీ మ్యూజిక్

This post is also available in : English

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*