అమెరికా, ఇరాన్‌ మధ్య మాటల తూటాలు

అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్‌ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తమతో యుద్దమంటే అంతా సులువైంది కాదన్న ఇరాన్‌ అధ్యక్షుడు హసన్‌ రౌహానీ హెచ్చరికకు ఘాటుగా సమాధానం ఇచ్చింది అమెరికా.

అమెరికా, ఇరాన్‌ ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి వచ్చింది. ఇన్నాళ్లు నార్త్ కొరియా, అమెరికాల మధ్య ఇలాంటి పరిస్థితి ఉండేది. ఐతే ఈ మధ్యే ట్రంప్, కిమ్‌ సమావేశం కావటంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చల్లబడ్డాయి. దీంతో ఇప్పుడు అమెరికా దృష్టి ఇరాన్‌ పై పడింది. ఉగ్రవాదులకు సహకారం అందించే విషయంలో తమ ఆదేశాలను పట్టించుకోవటం లేదని.. అణుబాంబుల అంశంలోనూ లెక్క లేని తనంతో వ్యవహారిస్తుందని ఇరాన్ పై పడింది. ఐతే ఇరాన్‌ అధ్యక్షుడు హసన్‌ రౌహానీ మాత్రం అగ్రరాజ్యాన్ని లెక్క చేయటం లేదు. పులితో ఆటలు ఆడవద్దని ఏకంగా అమెరికానే హెచ్చరించి సంచలనం సృష్టించారు.

ఇరాన్‌ హెచ్చరికను అమెరికా సీరియస్‌ గా తీసుకుంది. రౌహనీ కామెంట్లకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. అమెరికాను బెదిరించాలని చూస్తే భవిష్యత్‌ లో తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని ఇరాన్‌ ను ఉద్దేశించి ట్రంప్‌ ట్వీట్ చేశారు.

ఇరాన్‌ ఉగ్రవాదుల ముఠాకు సహకరిస్తుందని కొంతకాలంగా అమెరికా ఆగ్రహంగా ఉంది. ఇవే ఆరోపణలతో 2015లో ఇరాన్‌ తో న్యూక్లియర్‌ ఒప్పందం నుంచి అమెరికా తప్పుకుంది. అప్పటి నుంచి ఇరాన్‌ పై అమెరికా ఆంక్షలు విధించి రాజకీయంగా ఒత్తిడి తేచ్చేందుకు ‍ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఇరుదేశాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం తీవ్రస్థాయికి చేరుతోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*