ఆగస్ట్ మొదటివారం నుంచి రైతులకు పాడిపశువుల పంపిణి

పాడి పశువుల పెంపకంపై ఆధారపడి రైతులను ప్రోత్సహించేందుకు సబ్సిడీపై పశువులు, ఆవుల పంపిణీ చేపట్టామని మంత్రి తలసాని అన్నారు. పాడిగేదెల పంపిణీ కార్యక్రమం విధివిధానాల పై పశు వైద్యాధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆగస్టు మొదటి వారంలో కరీంనగర్, మదర్ డెయిరీ, ముల్కనూర్, విజయ డెయిరీలలో సభ్యులుగా ఉన్న 2.13 లక్షల మంది పాడి రైతులకు లబ్ది చేకూరుతుంది. ఈ పథకం అమలులో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. ఇప్పటికే మార్గదర్శకాలను జారీ చేశామని, లబ్ధిదారులు నచ్చిన ప్రాంతంలో, ఎంపిక చేసుకున్న నాణ్యమైన పాడి పశువులు, ఆవులను కొనుగోలు చేసేలా విధి విధానాలు రూపొందించామన్నారు. పాడి పశువుల కొనుగోలు పై రైతులకు అవగాహన కల్పించేలా కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి తలసాని అధికారులకు సూచించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*