గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటిన డిప్యూటీ సీఎం

నిజామాబాద్ ఎంపీ కవిత గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించిన డిప్యూటీ సీఎం మహ్మద్ అలీ మంత్రుల నివాస ప్రాంగణంలోని తన బంగళా ఆవరణలో మూడు మొక్కలు నాటారు. హరితాహారం ఇంచార్జ్ ప్రియాంక వర్గీస్ చాలెంజ్ ను స్వీకరించిన ఎంపీ కవిత తన ఇంటి ముందు మూడు మొక్కలు నాటి, డిప్యూటీ సీఎం మహమ్మద్ అలీ, ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్, ప్రముఖ దర్శకుడు రాజమౌళి పేర్లను నామినేట్ చేసిన విషయం తెలిసిందే. ఛాలెంజ్ స్వీకరించిన సైనా నెహ్వాల్ మూడు మొక్కలను నాటి మరో ముగ్గురి పేర్లను నామినేట్ చేశారు. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ కుమారుడు మహమ్మద్ ఆజం అలీ, మనమడు ఫుర్కాన్ అహ్మద్ పేర్లను నామినేట్ చేస్తూ గ్రీన్ చాలెంజ్ విసిరారు. వారు ఇద్దరూ మూడు మొక్కలు నాటి మరో ముగ్గురికి ఛాలెంజ్ చేస్తారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*