హైకోర్టులో స్వామి పరిపూర్ణానంద కేసు వాదనలు

హైదరాబాద్ నగర బహిష్కరణ ఉత్తర్వులను కొట్టివేసేలా ఆదేశాలు ఇవ్వాలని స్వామి పరిపూర్ణానంద చేసిన విజ్ఞప్తిపై హైకోర్టులో వాద ప్రతివాదనలు జరిగాయి. పరిపూర్ణ నంద తరపు మాజీ అడ్వొకేట్ జనరల్ ప్రకాష్ రెడ్డి వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరపున రామచందర్ రావు వాదించారు. ఆదిలాబాద్, కరీంనగర్ లో గతంలో స్వామి పరిపూర్ణానంద ఇచ్చిన ప్రసంగాల ఆధారంగా బహిష్కరించామని ప్రభుత్వ తరపు న్యాయవాది అన్నారు. హైదరాబాద్ పరిధిలో కేసులు నమోదు కాకుండా లేకుండా ఎలా బహిష్కరిస్తారని పిటిషనర్ తరపు న్యాయవాది ప్రకాష్ రెడ్డి అన్నారు. ఎప్పుడో ఇచ్చిన స్పీచులను పట్టుకుని ఇప్పుడు బహిష్కరిస్తున్నాం అంటే ఎలా అని పిటిషనర్ తరపు న్యాయవాది ప్రశ్నించారు. ధర్మాగ్రహ యాత్రకు మొదట అనుమతి ఇచ్చి, తర్వాత ఎందుకు నిరాకరించారో తెలపాలని పిటిషనర్ పేర్కొన్నారు. ఆర్టికల్19 ప్రకారం దేశంలో ఎక్కడైనా జీవించే హక్కు ఉంటుందని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. స్వామి పరిపూర్ణనంద పై వేసిన నగర బహిష్కరణ ఆంక్ష ఎత్తివేయాలని ఆయన కోరారు. ఇరువాదనలు విన్న హైకోర్టు.. పోలీసులు జారీ చేసిన ఒరిజినల్ డాక్యుమెంట్లను మంగళవారం సమర్పించాలని ఆదేశించింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*