మిషన్ భగీరథ పనులు ఇట్లా నడిస్తే ఊరుకోను!

ఇంటింటికీ మంచినీరు అందించే మిషన్ భగీరథ పథకం పనుల్లో స్పీడు తగ్గడంపై మంత్రి హరీష్ రావు అసహనం వ్యక్తం చేశారు. పనులలో వేగం పెంచాలని, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. సిద్ధిపేట సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో సుదీర్ఘంగా సమీక్ష జరిపారు. హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ, బెజ్జంకి, అక్కన్నపేట మండలాల్లోని రిహబిలిటేషన్ల వారీగా ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులతో చర్చిస్తూ.. పనుల వివరాలను ఆరా తీశారు. ఇది వరకే జరిగిన సమీక్షతో పొలిస్తే ఈసారి ఏలాంటి మార్పు రాలేదని అధికారుల పనితీరు పై అసంతృప్తి వ్యక్తం చేశారు. పని సాగదీస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపాదిత మండలాల్లో జరుగుతున్న పనుల పురోగతిపై అధికారులను, ఏజెన్సీల వారీగా అడిగి తెలుసుకున్నారు. కొన్ని చోట్ల పనులు మందకొడిగా జరుగుతున్న కారణాలపై ఆరా తీశారు. అవసరమైన విధంగా కూలీలను పెంచుతూ వేగంగా పనులు పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ తాగునీరు అందిన మొదటి జిల్లాగా ప్రకటించేందుకు అనుగుణంగా మిగిలిన పనులను పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. వచ్చే సోమవారం తిరిగి సమీక్షా సమావేశం నిర్వహిస్తామని, అప్పటిలోపు ఎలాంటి పెండింగ్‌ ఉండకుండా చూడాలని సూచనలు చేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*