నాగచైతన్య-సమంత జంటగా కొత్త సినిమా షురూ!!

మోస్ట్ ఏవైటెడ్ కాంబినేషన్ నాగచైతన్య-సమంత జంటగా నూతన చిత్ర ప్రారంభోత్సవం ఇవాళ జరిగింది. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి-హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి “నిన్ను కోరి”తో ప్రేక్షకులను విశేషంగా అలరించిన శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు.
హైద్రాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ చిత్ర ప్రారంభోత్సవం లాంఛనంగా జరిగింది. నాగార్జున ముఖ్య అతిధిగా విచ్చేసి బౌండెడ్ స్క్రిప్ట్ ను దర్శకుడు శివ నిర్వాణకు అందించారు. నాగచైతన్య-సమంత వివాహం అనంతరం నటిస్తున్న చిత్రమిదే కావడం విశేషం.
దివ్యాన్ష కౌశిక్ రెండో హీరోయిన్ గా నటిస్తుండగా.. శ్రీనివాస్ అవసరాల, రావురమేష్, పోసాని కృష్ణమురళి ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఆగస్ట్ రెండోవారం నుంచి మొదలవుతుంది. గోపీసుందర్ సంగీత సారధ్యం వహించనున్న ఈ చిత్ర ప్రారంభోత్సవ వేడుకలో మైత్రీ మూవీ మేకర్స్ అధినేత నిర్మాత నవీన్ యెర్నేని, రచయిత కోన వెంకట్ పాల్గొన్నారు.
తారాగణం:
నాగచైతన్య, సమంత, దివ్యాన్ష కౌశిక్, రావురమేష్, శ్రీనివాస్ అవసరాల, పోసాని కృష్ణమురళి, శత్రు, రాజశ్రీ నాయర్ తదితరులు..
సాంకేతికవర్గం:
రచన-దర్శకత్వం: శివ నిర్వాణ
నిర్మాతలు: సాహు గారపాటి-హరీష్ పెద్ది
నిర్మాణ సంస్థ: షైన్ స్క్రీన్స్
సంగీతం: గోపీ సుందర్
ఛాయాగ్రహణం: విష్ణు శర్మ
ప్రోడ్కషన్ డిజైనర్: సాహి సురేష్
కూర్పు: ప్రవీణ్ పూడి
కో-డైరెక్టర్: లక్ష్మణ్ మూసులూరి
లైన్ ప్రొడ్యూసర్: నాగమోహన్
పి.ఆర్.ఓ: వంశీ-శేఖర్

This post is also available in : English

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*