టీవీ షోను హోస్ట్ చేయబోతున్న పవన్ కళ్యాణ్!

pawan tv show
pawan to host a tv show

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు సంబంధించి తాజాగా ఒక సంచలన వార్త చక్కర్లు కొడుతోంది. అది పవన్‌ రాజకీయ ప్రయాణంలో కొత్త మలుపుగా ఉండబోతోంది. తన రాజకీయాలకు సినిమా రంగులు అద్దబోతున్నారు. అయితే అది ప్రజా సమస్యలపై ఉండనుంది. క్లియర్‌గా చెప్పుకోవాలంటే చక్కర్లు కొడుతున్న వార్తల ప్రకారం పవన్ త్వరలోనే ఒక టీవీ షోను నిర్వహించబోతున్నారు.

అది తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషల్లో వారానికి రెండు సార్లు ప్రసారం కానుంది. దీంతో ఏపీ సమస్యలు దేశ వ్యాప్తంగా అందరికీ తెలిసే అవకాశం ఉంది. అయితే ఏపీ సమస్యలు మాత్రమే తీసుకుంటారా లేదా అనేది తెలియాల్సి ఉంది. అది బాలీవుడ్ సంచలన నటుడు అమిర్ ఖాన్ నిర్వహించిన ‘సత్యమేవ జయతే’ కార్యక్రమంలో ఉండబోతుంది. ఇందులో పవన్ పలు ప్రజా సమస్యలను ఎంచుకుని వాటిపై క్లియర్‌గా చర్చించనున్నారు.

ఈ కార్యక్రమానికి సంబంధించి జనసేన వర్గీయులు తీవ్రమైన కసరత్తులు చేస్తున్నట్టు సమాచారం. ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలు వంటి పలు ప్రజా సమస్యలను ఎంపిక చేయడం నుంచి షో పేరును నిర్ణయించడం వరకూ వాళ్లు హార్డ్ వర్క్ చేస్తున్నారట. త్వరలోనే ఈ నిర్ణయాన్ని పవన్ అమలు చేయబోతున్నారని బాగా ప్రచారం జరుగుతోంది.

మరి ఈ ప్రచారం ప్రకారంగానే అంతా జరిగితే ఆ టీవీ షో ఒక సంచలనంగా మారబోతున్నట్టే. ఈ వార్తను తెలుసుకున్నప్పటి నుంచీ పవన్ ఫ్యాన్స్ కూడా టీవీల్లో షోను త్వరగా చూడాలని ఆసక్తి పెంచుకుంటున్నారు.

This post is also available in : English

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*