ఆగస్ట్ 4,5 తేదీల్లో రాష్ట్రంలో రాష్ట్రపతి పర్యటన

ఆగస్టు 5 న సంగారెడ్డి జిల్లా కంది ఐఐటీ 7వ స్నాతకోత్సవానికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ హాజరవుతున్నారు. ప్రెసిడెంట్ టూరు నేపథ్యంలో అన్ని శాఖలు సమన్వయం చేసుకోవాలని ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషి అధికారులను ఆదేశించారు. రాష్ట్రపతి ఆగస్టు 4, 5 తేదీలలో రాష్ట్రంలో పర్యటిస్తారు. అవసరమైన సిబ్బంది, బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని సీఎస్ సూచించారు. రాష్ట్రపతి ప్రయాణించే మార్గాలలో రోడ్లకు మరమ్మత్తులు, అవసరమైన హెలిపాడ్ ఏర్పాటు, నిరంతర విద్యుత్ సరఫరా , అగ్నిమాపక యంత్రాల ఏర్పాటు, మంచి నీటి వసతి, పరిసరాల పరిశుభ్రత కోసం స్పెషల్ డ్రైవ్ లు నిర్వహించాలని జోషి ఆదేశించారు. ఆగస్టు 4న సాయంత్రం బేగంపేట విమానాశ్రయం రాష్ట్రపతి చేరుకుంటారు. అక్కడి నుంచి రాజ్ భవన్ వెళ్తారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. 5వ తేదీ ఉదయం బొల్లారం లోని రాష్ట్రపతి నిలయానికి వెళ్తారు. అక్కడ మొక్కలు నాటి, కంది ఐఐటీ క్యాంపస్‌ కు బయల్దేరి కాన్వొకేషన్‌లో పాల్గొంటారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*