తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితేంటన్న రాహుల్ గాంధీ

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ స్థితిగతులను రాహుల్ గాంధీ ఆరా తీశారు. నెల రోజుల పర్యటన వివరాలను ఏఐసీసీ సెక్రటరీలు రాహుల్ దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందని, పట్టణ ప్రాంతాల్లో కంటే గ్రామాల్లో పార్టీకి అనుకూలత కనిపిస్తోందని వారు వివరించారు. స్థానిక సమస్యలపై దృష్టిపెట్టి ప్రజల్లోకి వెళితే పార్టీకి అనుకూలత ఉంటుందని చెప్పారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత కనిపించిందని వారు రాహుల్ తో అన్నారు. లోక్ సభ అభ్యర్థుల ఎంపికపై మొదట దృష్టి సారించామని వివరించారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సహకారాన్ని అందిస్తామని రాహుల్ గాంధీ వారితో చెప్పారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*