బీఎస్ఎన్ఎల్ ‘వింగ్స్’కు అనూహ్య స్పందన.. 4వేల బుకింగ్స్

బీఎస్ఎన్ఎల్ ఇటీవల ప్రకటించిన ‘ఇంటర్నెట్ టెలీఫోనీ’ సేవలు ‘వింగ్స్’ కు వినియోగదారుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. రేపటి నుంచే ఈ సేవలు ప్రారంభం కానుండగా ఇప్పటి వరకు 4 వేల బుకింగ్స్ వచ్చాయి. ఈ సేవలతో వినియోగదారులు దేశంలోని ఏ ఫోన్ నంబరుకైనా మొబైల్ యాప్ ద్వారా కాల్ చేసుకుని మాట్లాడుకోవచ్చు. టెలికం మంత్రి మనోజ్ సిన్హా జూలై 11న ఈ సేవలను ప్రారంభించగా 25 నుంచి అందుబాటులోకి రానున్నాయి.

టెలీఫోనీ సేవలను అందుబాటులోకి తెచ్చిన తొలి టెలికం సంస్థగా బీఎస్ఎన్ఎల్ రికార్డులకెక్కనుంది. ఈ సేవలు యువతను మరింత ఆకర్షిస్తాయని ఆ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అనుపమ్ శ్రీవాస్తవ తెలిపారు. ఈ కొత్త సర్వీసుల కోసం ఇప్పటి వరకు 4వేల మంది సబ్‌స్క్రైబ్ చేసుకున్నట్టు తెలిపారు.

వార్షిక ఫీజు రూ.1,099 చెల్లించి వినియోగదారులు ఇంటర్నెట్, వైఫై ద్వారా దేశంలోని ఏ నెట్‌వర్క్ మొబైల్ నంబరుకైనా అపరిమితంగా మాట్లాడుకోవచ్చు. ప్రపంచంలో ఏమూల ఉన్నా వింగ్స్ యాప్‌ ద్వారా కాల్స్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఇంటర్నెట్, లేదా, వైఫై ఉంటే సరిపోతుంది. అయితే, రూ.1,099తో మాత్రం అపరిమిత ఎస్టీడీ కాల్స్ కాల్స్‌ మాత్రమే చేసుకోవచ్చని శ్రీవాస్తవ తెలిపారు.

వింగ్స్ యాప్ యూజర్ తప్పనిసరిగా బీఎస్ఎన్ఎల్ మొబైల్, ఆ సంస్థ ఇంటర్నెట్ కనెక్షన్ కలిగి ఉండాలనేం లేదు. మొబైల్ నెట్‌వర్క్ లేని చోట ఇంటర్నెట్ అందుబాటులో ఉండే అవకాశం ఉంది కాబట్టి కాల్స్ చేసుకోవడంలో ఇబ్బంది ఉండదు. ఏ ఆపరేటర్ ఇంటర్నెట్‌పైన అయినా వింగ్స్ పనిచేస్తుంది కాబట్టి కాల్స్ చేసుకునే సౌకర్యం నిత్యం అందుబాటులో ఉన్నట్టే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*